E-Paper
Advertisement

Mega Brothers Photo: కొణిదెల బ్రదర్స్.. పిక్ ఆఫ్ ది డే అంటే ఇదేరా..!

Mega Brothers Photo: కొణిదెల బ్రదర్స్.. పిక్ ఆఫ్ ది డే అంటే ఇదేరా..!
Advertisement
Chiranjeevi, Nagababu and Pawan kalyan in one Frame
Chiranjeevi, Nagababu and Pawan kalyan in one Frame

Chiranjeevi, Nagababu and Pawan kalyan in one Frame: మెగా బ్రదర్స్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొణిదెల శివ శంకర వరప్రసాద్.. చిరంజీవిగా మారిన దగ్గరనుంచి.. ఇండస్ట్రీకి తన తమ్ముళ్లను కూడా పరిచయం చేసుకుంటూ వచ్చాడు. మొదట పెద్ద తమ్ముడు నాగబాబును నటుడిగా పరిచయం చేశాడు. ఆయనకు యాక్టింగ్ అంతగా సెట్ కాకపోవడంతో నిర్మాతగా మారాడు. ఆ తరువాత చిన్న తమ్ముడు కళ్యాణ్ బాబును హీరోగా పరిచయం చేశాడు. కళ్యాణ్ బాబు కాస్తా పవన్ కళ్యాణ్ గా మారి.. చిరు తమ్ముడు పవన్ అన్న దగ్గరనుంచి పవన్ అన్న చిరు అనే రేంజ్ కు ఎదిగాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇక మెగాస్టార్ ఇంట ఏ పండగ జరిగినా.. ఏ ఫంక్షన్ జరిగినా ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కనిపిస్తారు. కానీ, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ మధ్య ఈ అన్నదమ్ములు చాలా రేర్ గా కనిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో.. సోషల్ మీడియా షేక్ అవుతుంది. తాజాగా పవన్, నాగబాబు.. చిరును కలిశారు. ప్రస్తుతం చిరు.. విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉండగా.. షూటింగ్ సెట్ కు వెళ్లి.. ఇద్దరు అన్నదమ్ములు పెద్దన్నయ్యను కలిసినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: Love Mouli Trailer: నవదీప్ బోల్డ్ కంటెంట్.. అర్జున్ రెడ్డికి మరో వెర్షన్ లా ఉందే..

ఇక దీనికి కారణం.. జనసేనకు చిరు ఆర్థిక సాయం అందించడమే. చిరు.. జనసేనకు రూ. 5 కోట్లు విరాళంగా అందించాడు. ఆ చెక్ తీసుకోవడానికే జనసేన నేతలు పవన్, నాగబాబు.. విశ్వంభర సెట్స్ కు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్, నాగబాబుతో చిరు కొద్దిసేపు ముచ్చటించాడు. అనంతరం ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఈ అన్నదమ్ములు కలిసి ఒక ఫోటో దిగారు. ఇక వీరి అమ్మగారి పేరు కూడా అంజనా దేవీనే. అలా అంజనీ పుత్రులు.. ఆంజనేయుడు ముందు ఇలా పోజ్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈ ఫొటోకు కొణిదెల బ్రదర్స్.. పిక్ ఆఫ్ ది డే అంటే ఇదేరా అని కొందరు.. అంజనీ పుత్రులు.. ఈ అన్నదమ్ములు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×