E-Paper
Advertisement

Minister Lokesh: నీ దుడ్లతో మ్యాచ్ చూస్తినా? జగన్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్.. ఆ వివరాలు వెల్లడి

Minister Lokesh: నీ దుడ్లతో మ్యాచ్ చూస్తినా? జగన్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్.. ఆ వివరాలు వెల్లడి
Advertisement

Minister Lokesh: చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ కొత్తదారులు వెతుకుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త అస్త్రాలను తెరపైకి తెస్తోంది.  ఓ వైపు సీఎం చంద్రబాబు.. మరోవైపు మంత్రి లోకేష్‌లను టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ ఖర్చులపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

క్రికెట్ మ్యాచ్ ఖర్చుల వివరాలు..  బయటపెట్టిన మంత్రి లోకేష్

Advertisement

వైసీపీ ప్రభుత్వంలో జగన్ విచ్చల విడిగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారంటూ వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు ఆనాడు జగన్ చేసిన  ఖర్చులకు సంబంధించి వివరాలు బయటపెట్టింది.. ఇంకా కంటిన్యూ చేస్తోంది కూడా. దీంతో వైసీపీ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యింది.  ఇదే అస్త్రంతో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైంది వైసీపీ.

ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌కు మంత్రి లోకేష్ హజయ్యారు. ఆయన మ్యాచ్‌కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ ఫోటోలను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది వైసీపీ. రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉందని, క్రికెట్ మ్యాచ్ చూడటానికి సదరు మంత్రి కోటిపై ఖర్చు చేశారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి లోకేష్.ౌ

Advertisement

వైసీపీ ఎత్తులు బూమరాంగ్.. చివరకు బిల్‌గేట్స్ ఖర్చులపైనా డిమాండ్

భారత్-పాక్ మ్యాచ్‌కు ప్రభుత్వ ఖర్చులతో వెళ్లానన్న ప్రచారాన్ని ఖండించారు సదరు మంత్రి. బుధవారం దీనిపై ఎక్స్ వేదికగా ఆయన రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ ఖర్చులతో శ్రీలంక వెళ్లానంటూ సాక్షి మీడియా చేసిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. ఫ్లయిట్ టికెట్, మ్యాచ్ టికెట్ తనదేనని తెలిపారు. నా దుడ్లతో తాను మ్యాచ్ చూశానని, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేశానా జగన్ అంటూ ప్రశ్నించారు.

మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం పాలకులు ఎదురు చూస్తుంటారు. ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక విమానంలో ఆయన వచ్చారు. సీఎం చంద్రబాబుతో దాదాపు మూడు గంటలపాటు గడిపారు. టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రభుత్వం చేస్తున్న పనులను ఆయనకు వివరించారు. తమ ప్రభుత్వం ఈ-గవర్నెన్స్, ఏఐ, డ్రోన్స్ టెక్నాలజీ వాటి గురించి వివరించారు.

ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు బిల్ గేట్స్. ఇదే సమయంలో బిల్ గేట్స్ టూర్‌ని తనకు అనుకూలంగా మార్చుకుంది వైసీపీ. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ మంగళవారం మీడియా సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

ALSO READ: మండలిలో ఏం జరిగింది? షాకైన వైసీపీ 

బిల్ గేట్స్ అమరావతికి వచ్చినప్పుడు ఆయనకు ఇచ్చిన టీలు, కాఫీలు, సమోసాలు, కార్లు, హోటల్, ఫ్లైట్ కోసం ఎంత ఖర్చులు పెట్టిందో వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  ఆ స్థాయి వ్యక్తులు రావడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చెప్పాలని డిమాండ్ చేస్తుంటారు.. కానీ వైసీపీ నేతలు మాత్రం బిల్ గేట్స్ తీసుకున్న టీ, కాఫీలు, పుణుకుల ఖర్చుల గురించి ప్రశ్నించడం ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఇదేకాదు.. న్యూఇయర్‌కు సీఎం చంద్రబాబు ఫ్యామిలీ లండన్ వెళ్లింది. ఈ విషయం మంత్రుల సమావేశంలో సీఎం ప్రస్తావించారు.  దానిపై సీఎం చంద్రబాబు సీక్రెట్‌గా ఫారెన్ టూర్‌కి వెళ్లారని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ రకరకాలుగా వైసీపీ ప్రచారం చేసిన విషయం తెల్సిందే. వైసీపీ ఎలాంటి ఎత్తుగడులు వేస్తుందని ముందు పసిగట్టిన టీడీపీ నేతలు.. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×