E-Paper
Advertisement

Dallas News: క్లారిటీ ఇచ్చేసిన మంత్రి లోకేష్.. వైసీపీ నేతలకు కష్టాలు, సప్తసముద్రాల అవతలున్నా

Dallas News: క్లారిటీ ఇచ్చేసిన మంత్రి లోకేష్..  వైసీపీ నేతలకు కష్టాలు, సప్తసముద్రాల అవతలున్నా
Advertisement

Dallas News:  ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుందా? అస్సలు వదిలేది లేదని మంత్రి లోకేష్ ఎందుకన్నారు? ఆ నేతల జోలికి ఇంకా వెళ్లలేదా? కూటమి ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ ఎవరు? ఎందుకు లోకేష్ ఆ మాటలన్నారు? ఇవే ప్రశ్నలు చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడుతున్నాయి.

Advertisement

క్లారిటీ ఇచ్చేసిన మంత్రి లోకేష్

మంత్రి లోకేష్ ఎక్కడికి వెళ్లినా రెడ్‌ బుక్ గురించి పదే పదే  ప్రస్తావనకు వస్తోంది. దానిపై చాలామంది ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. వారిపై చర్యలు తప్పవని పదే పదే హెచ్చరిస్తున్నారు కూడా.  ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు మంత్రి లోకేష్. డాలస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరాలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఆయన మాటల మధ్యలో రెడ్ బుక్ ప్రస్తావనకు వచ్చింది. రెడ్‌ బుక్ తన పని తాను చేసుకుపోతుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారినీ ఎవర్నీ వదనని తేల్చిచెప్పారు. ముఖ్యంగా తన తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని తేల్చి చెప్పారు.

వైసీపీ ఆ నేతలు ఎవరు?

మహిళలను గౌరవించాలనేది చంద్రబాబు విధానం అని వివరించారు. సీన్ కట్ చేస్తే.. రీసెంట్‌గా మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం, పరకామణి కేసులపై నోరు విప్పారు. వాటిని చిన్న కేసులుగా తేల్చిపారేశారు.

ఆయన మాటలను గమనించిన టీడీపీ నేతలు.. ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు భార్యని వైసీపీ నేతలు అవమానించిన సమయంలో జగన్ నవ్వుతూ కనిపించారని అంటున్నారు.  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఉన్నారని మొదటి నుంచి టీడీపీ నేతలు బలంగా చెబుతున్నారు. ఇప్పటికే ఆయన వివిధ కేసుల్లో అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలులో ఉన్నారు కూడా.

ALSO READ: ఇస్రో శాస్త్రవేత్తగా ఉండూరు యువకుడు ఎంపిక

వ్యవహారంలో నెక్ట్స్  ఎవరన్నది టీడీపీ నేతల ప్రశ్న. దీని వెనుక రకరకాలుగా నేతలు చర్చించుకుంటున్నారు. లోకేష్ మాటలను రెండువిధాలుగా అర్థం చేసుకున్నవాళ్లు లేకపోలేదు. ఎన్నారై టీడీపీ నేతలను ఉత్సాహపరచడానికి ఆ విధంగా అన్నారని కొందరంటున్నారు. కచ్చితంగావ్యవహారంలో ఇంకెందుకు అరెస్టు కావడం ఖాయమని అంటున్నారు.

అమరావతి నుంచి అందుకున్న సమాచారం మేరకు.. రానున్న జనవరిలో ఇద్దరు వైసీపీ నేతలపై బలమైన కేసులు  రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బహుశా వారు మంత్రి లోకేష్ చెప్పిన జాబితాలో  ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి డాలస్ వేదికగా మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీలోనూ చర్చ మొదలైంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×