E-Paper
Advertisement

IndiGo Crisis Reason: ఇండిగో సంక్షోభానికి అదే కారణం.. రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

IndiGo Crisis Reason: ఇండిగో సంక్షోభానికి అదే కారణం.. రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
Advertisement

IndiGo Crisis Reason: ఇండిగో విమానాల రద్దుపై రాజ్యసభలో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఎఫ్డీటీఎల్ నిబంధనలను రూపొందించే ముందు అందరితో చర్చించామని ఆయన చెప్పారు. నవంబర్ 1 నుంచి రెండో దశ నిబంధనలు అమల్లోకి తెచ్చామని, ఎఫ్టీటీఎల్ అమల్లోకి వచ్చిన నెల వరకు సజావుగానే విమాన సర్వీసులు నడిచాయన్నారు. డిసెంబర్ 3 నుంచే సమస్య మొదలైందన్నారు. ఇండిగో అంతర్గత సమస్యల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందన్నారు.

5,86,700 టికెట్లు రద్దు

పైలట్ రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల వల్లే ఇండిగో విమాన సర్వీసుల రద్దు అయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ విమాన సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నానన్నారు. 5,86,700 విమాన టికెట్ రద్దు అయ్యాయని తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా కేంద్రం పరిమితులు విధించిందన్నారు. టికెట్టు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.

విచారణ ప్రారంభం

Advertisement

ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘విమానాల ఆలస్యం, రద్దుల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పౌర విమానయాన శాఖ నిబంధనలు విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇండిగో చెబుతున్న కారణాలపై విచారణ ప్రారంభించాం. నిరంతర సాంకేతిక పరిజ్ఞానం అప్‌గ్రేడేషన్ ఈ రంగంలో భాగం, భారతదేశ విమానయాన రంగానికి అత్యున్నత ప్రపంచ ప్రమాణాలను నిర్ధారించడమే మా లక్ష్యం’ అన్నారు.

Also Read: Indigo Crisis: ఇండిగో సంక్షోభానికి కారణం వీళ్లే.. ఎంజాయ్ చేస్తున్నారంటూ పేర్లు భయటపెట్టిన ఆ సంస్థ ఉద్యోగి 

ఉల్లంఘనలపై చర్యలు

Advertisement

“ప్రయాణికుల విషయానికొస్తే, మొత్తం 5,86,705 టికెట్లు రద్దు అయ్యాయి. దీనికి రూ. 569 కోట్లు రీఫండ్ చెల్లించారు. దీనితో పాటు సంస్థ పనితీరుపై మరిన్ని విషయాలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి” అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నకు స్పందిస్తూ.. తాము గతంలో కూడా అనేక చర్యలు తీసుకున్నామని, నిర్దిష్ట మార్గదర్శకాలు, నిబంధనలు అమలులో ఉన్నాయన్నారు. ఈ మార్గదర్శకాలు, నిబంధనలు పాటించేలా చేయడమే నియంత్రణ సంస్థగా తమ విధిగా తెలిపారు. నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడల్లా కేంద్రం చర్య తీసుకోవడానికి వెనుకాడలేదని చెప్పారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×