E-Paper
Advertisement

ఘోరం.. కన్న కూతురిపై కాలయముడైన తండ్రి.. ప్రేమ పెళ్లి చేసుకుందని ప్రాణం తీశాడు!

ఘోరం.. కన్న కూతురిపై కాలయముడైన తండ్రి.. ప్రేమ పెళ్లి చేసుకుందని ప్రాణం తీశాడు!
Advertisement

Father & Daughter Incident: ప్రేమ అన్న రెండక్షరాల పదం ఆ ఇంట్లో చిచ్చు పెట్టింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కాలయముడిగా మారిన ఉదంతం పల్నాడు జిల్లా మాచర్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చిన్నప్పటి నుండి గుండెల మీద పెంచుకున్న కూతురు, తన ఇష్టప్రకారమే జీవిస్తానని చెప్పడాన్ని ఆ తండ్రి భరించలేకపోయాడు. “పరువు” అనే ముసుగులో కన్నప్రేమను చంపేసి, కసాయివాడిలా మారి తన సొంత బిడ్డ ప్రాణాలను గాలిలో కలిపేసాడని ఆరోపణలు..

“నాన్న చంపొద్దు.. విషమివ్వు తాగి చచ్చిపోతా” అని వేడుకున్నా..
గత నెల 4వ తేదీన మాచర్లకు చెందిన చౌడేశ్వరి(22), నాగరాజు అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, పెద్దమనుషుల సమక్షంలో రాజీ చేస్తామని నమ్మించి పిలిపించిన తండ్రి కోటేశ్వరరావులో మానవత్వం మంటగలిసింది. కూతురిని చూసిన ఆవేశంలో ఆమెపై దాడికి దిగాడు. “నాన్న నన్ను కొట్టొద్దు.. కావాలంటే పురుగుల మందు ఇవ్వు తాగి చచ్చిపోతాను కానీ ఇలా హింసించకు” అని ఆ బిడ్డ ప్రాధేయపడినా ఆ కరకు గుండె కరగలేదు. మేనల్లుడి సాయంతో ఆమె గుండెలపై కూర్చుని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరివేసి నిలువునా ప్రాణం తీశాడని సమాచారం.

Advertisement

పరువు కోసం ప్రాణం తీసిన వైనం.. పథకం ప్రకారమే హత్య?
ఈ దారుణానికి ఆ తండ్రికి తన మేనల్లుడు కూడా తోడయ్యాడని పలువురు ఆరోపణ. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తమ కుల గౌరవం పోయిందని, సమాజంలో తల ఎత్తుకోలేకపోతున్నామనే క్రూరమైన ఆలోచనే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది. కూతురిని ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతోనే వారిని గ్రామానికి రప్పించినట్లు సమాచారం. ఒకవైపు బిడ్డ ఆర్తనాదాలు చేస్తున్నా, మరోవైపు ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్నా ఏమాత్రం కనికరం లేకుండా కిరాతకంగా వ్యవహరించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Also Read: జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బీభత్సం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Advertisement

చట్టం ముందు తలవంచక తప్పదు!
ఈ ఘోర కలిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్య జరిగిన తర్వాత తప్పించుకోవాలని చూసిన నిందితులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా? తన జీవితాన్ని తాను ఎంచుకోవడం తప్పా? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పరువు పేరుతో పసిప్రాణాలను బలితీసుకునే ఇలాంటి ఉన్మాద చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కన్నబిడ్డను కాపాడుకోవాల్సిన చేతులే కాలయముడి పాశాలై బిగించిన ఈ ఘటన మాచర్ల చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×