E-Paper
Advertisement

ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10 వేల ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఏయే విభాగాలంటే

ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10 వేల ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్, ఏయే విభాగాలంటే
Advertisement

Amaravati: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తోంది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ జాబ్‌ క్యాలెండర్‌-2026 సమీక్షా సమావేశం నిర్వహించారు. నాలుగు దశలుగా ఆయా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన పనులు తెర వెనుక చకచకా జరుగుతున్నాయి.

ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త- ఏపీలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ప్రకటనలు చేసేందుకు రెడీ అయ్యింది. బుధవారం అమరావతిలో ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం జాబ్‌ క్యాలెండర్‌-2026పై సమీక్షించింది.

Advertisement

10 వేల ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్-వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌-2026 ప్రకారం మొత్తం 10,060 ఉద్యోగాలున్నాయి. వాటిని నాలుగు దశల్లో భర్తీ చేయనున్నారు.  తొలి దశ కింద యూనివర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్‌ విడుదలైంది. రెండో దశలో 3,168 పోస్టుల భర్తీకి ఆగస్టు 15న నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావించింది.

సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల హంగామా-అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో సాంకేతిక అంశాలు ఉండడంతో కాస్త ఆలస్యమైనట్లు కనిపిస్తోంది. ఆ లెక్కన సెప్టెంబరు 15న నోటిఫికేషన్ విడుదల చేయనుంది  ప్రభుత్వం. మిగతా మూడు, నాలుగు దశలకు సంబంధించి అక్టోబరు 15న నోటిఫికేషన్‌ విడుదలకు చేయాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement

మూడో దశలో 2,388 ఉద్యోగాలు, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అదే సమయంలో గ్రూప్‌-1 లో కొలువుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఓవరాల్‌లో ఈ ఏడాదిలో మరో 10 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం.

ALSO READ: భోగాపురం ఎయిర్‌పోర్టు.. యూజర్ ఛార్జీలు ఎంతంటే

నోటిఫికేషన్ విషయం తెలియగానే నిరుద్యోగుల్లో ఒక్కటే ఆనందం. ఎలాగైనా జాబ్ కొట్టాలని మరికొందరు ఆశావహులు భావిస్తున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు రెడీ అవుతున్నాయి. మరికొందరు ఆల్రెడీ అదే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×