E-Paper
Advertisement

భోగాపురం ఎయిర్‌పోర్టు.. యూజర్ ఛార్జీలు ఎంతంటే, ట్రావెల్ కోడ్ బదిలీ

భోగాపురం ఎయిర్‌పోర్టు.. యూజర్ ఛార్జీలు ఎంతంటే, ట్రావెల్ కోడ్ బదిలీ
Advertisement

Bhogapuram Airport: కేవలం రెండు రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి అన్ని అనుమతులు వచ్చేశాయి. అంతా బాగానే ఉంది. యూజర్ ఛార్జీల మాటేంటి? ప్రయాణికుల నుంచి ఏ స్థాయిలో వసూలు చేస్తారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడాయి.. వెంటాడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

ఆగష్టు 17 నుంచి రాకపోకలు మొదలు-భోగాపురం ఎయిర్‌పోర్టు ఆగష్టు ఒకటిన అనగా శనివారం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. విమానాల రాకపోకలు ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. అప్పటి నుంచి జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు కంటిన్యూ కానున్నాయి. ఆ తర్వాత  విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నడిచే కమర్షియల్‌ విమాన సేవలను నిలిపివేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటన చేసింది.

Advertisement

ట్రావెల్ కోడ్ బదిలీ-దీంతో విశాఖ ఎయిర్‌పోర్టుకున్న అంతర్జాతీయ ట్రావెల్‌ కోడ్‌ VTZ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పూర్తిగా మూతపడే అవకాశం ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో వాయుసేన, సాయుధ దళాలు, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథుల కోసం ప్రత్యేక విమానాలు, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటి రాకపోకలు కంటిన్యూ కానున్నాయి.

 యూడీఎఫ్‌ ఛార్జీల మాటేంటి? విమాన రాకపోకల వరకు ఓకే. మరి ప్రయాణికుల యూజర్ ఛార్జీల మాటేంటి? దీనిపై క్లారిటీ వచ్చేసింది. భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్‌ నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే ప్రయాణికులు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు- యూడీఎఫ్‌ వసూలు చేయనున్నారు.

Advertisement

ఇదిగో వివరాల జాబితా-దీనిపై ఎయిర్‌పోర్టు టారిఫ్‌ నియంత్రణ సంస్థ-ఏఈఆర్‌ఏ  ఆదేశాలు ఇచ్చింది. వాటిని  విమానాశ్రయ నిర్వహణ సంస్థ జీఎంఆర్‌, బుధవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీకి తెలిపింది. భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు మొదలైన నుంచి యూజర్ ఛార్జీలు ప్రారంభం అవుతాయని వెల్లడించింది.

ALSO READ: ఆడవాళ్లని అవమానిస్తారా.. వైసీపీ నాయులపై నారా భువనేశ్వరి వార్నింగ్!

విశాఖ నుంచి బయలుదేరే జాతీయ ప్రయాణికులు రూ.835 వసూలు చేయనుంది. అదే  అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి  రూ.1255 చొప్పున చెల్లించాల్సి వుంటుంది. భోగాపురం ఎయిర్ పోర్టుకు వచ్చే దేశీయంగా వచ్చేవారు రూ.355 వసూలు చేస్తారు. విదేశాల నుంచి వచ్చేవారి నుంచి  రూ.545 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం విమానాశ్రయంలో సర్వీసులకు సంబంధించి విడిగా ఛార్జీల ఆమోదాన్ని నిర్మాణ సంస్థలు పొందాల్సివుంది. ల్యాండింగ్, వినియోగదారు అభివృద్ధి ఫీజు- యూడీఎఫ్‌, ఏరోబ్రిడ్జ్‌ ఛార్జీలు, పార్కింగ్‌ ఫీజులు ఇలా అన్నిరకాలుగా సదరు విమాన శాఖ నుంచి ఆమోదాలు పొందాలి. రకరకాలుగా ఉన్నవాటిని కేవలం మూడు విభాగాలుగా చేయాలని ఆలోచన చేస్తోంది. వాటిలో ల్యాండింగ్‌, పార్కింగ్ ‌ఛార్జీలు, యూడీఎఫ్ విభాగాలు చేయాలనే ప్రతిపాదన ఉంది.

Related News

ఆడవాళ్లని అవమానిస్తారా.. వైసీపీ నాయులపై నారా భువనేశ్వరి వార్నింగ్!

శ్రీ సత్య సాయి జిల్లాలో కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన కేటుగాడు.. ఏం చేశాడంటే!

పార్టీలో వ్యక్తిగత ఎజెండాలు సాగవు.. టీడీపీ నేతలకు మంత్రి నిమ్మల వార్నింగ్!

ఇచ్ఛాపురంలో భారీగా గంజాయి స్వాధీనం.. ఒడిశా ముఠా అరెస్ట్!

ఎర్రబస్సు అన్నోడికి… ఎయిర్‌బస్ క్రెడిటా? జగన్‌పై విరుచుకుపడ్డ ఎంపీ కలిశెట్టి!

చంద్ర బాబు పాలనపై అంబటి పంచ్‌లు.. ఆయన వస్తే వర్షాలు రావట!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ తెచ్చింది జగనే.. మాజీ మంత్రి ధర్మాన కామెంట్స్

Big Stories

Advertisement
×