E-Paper
Advertisement

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’
Advertisement

TTD Nandakam App: శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వచ్చే భక్తుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ వాలంటీర్లు ఉన్నా, సరిగా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ‘నందకం’ యాప్‌ని రంగంలోకి దించుతోంది టీటీడీ. ఈనెల 16 అంటే బుధవారం ఆ యాప్‌ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇప్పుడు ఆ యాప్ విశేషాలు తెలుసుకుందాం.

తిరుమలలో చిటికెలో సమస్యలు పరిష్కారం

శ్రీవారి దర్శనం కోసం ప్రతీరోజు వేలల్లో భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. కొండకు వచ్చే భక్తులకు రకరకాల ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే కొండకు వచ్చే భక్తులు చిన్న, చిన్న సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో కాటేజీలు, వసతి గదులకు సంబంధించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా యాప్ రెడీ చేసింది. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా నందకం పేరుతో ఈ యాప్‌ను డిజైన్ చేసింది. మరో రెండు రోజుల్లో భక్తులకు అందుబాటులోకి రానుంది.

శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’ వచ్చేసిందోచ్

Advertisement

నందకం యాప్‌పై గత నెల ఆగస్టు నుంచి అధికారులు ప్రయోగాత్మకంగా వినియోగించడం మొదలుపెట్టారు. నెల రోజుల పాటు ఉపయోగించారు. వసతి గదుల్లో నీటి కొరత, కుళాయిల లీకేజీలు, బెడ్‌షీట్లు, విద్యుత్‌ అంతరాయం, పారిశుద్ధ్యం వంటి దాదాపు 3 వేల సమస్యల్ని యాప్‌లో నమోదు చేశారు. ఆయా సమస్యలను సంబంధిత విభాగాల ద్వారా పరిష్కరించింది. ఎన్ని సమస్యలు గుర్తించారు? ఎన్ని పరిష్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో డ్యాష్‌బోర్డులో అధికారులకు కనిపిస్తుంది. రెండు రోజుల తర్వాత ఈ యాప్ పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి రానుంది. పీఏసీ లాకర్లు, కల్యాణకట్టలకు సంబంధించిన సమస్యలను నమోదు చేసేందుకు విస్తరించనున్నారు.ఆ తర్వాత దాని పరిధి క్రమంగా విస్తరించనున్నారు. భక్తులకు ఇచ్చే గదుల రసీదుపై నందకం యాప్‌ క్యూఆర్‌ కోడ్‌ ప్రింట్ చేస్తారు.

ALSO READ: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

Advertisement

నందకం యాప్‌లో ఏఐ సాంకేతికతను ప్రధానంగా ఉపయోగించారు అధికారులు. తిరుమలలో 7,043 గదులకు ఈ యాప్‌ను లింక్ చేశారు. ఈ యాప్‌ను ఏఈ, డిప్యూటీ ఈఈ, ఈఈ, ఎఫ్‌ఎంఎస్‌ విభాగంలో సూపర్‌వైజర్లు వినియోగిస్తున్నారు. సమస్యలను ఫోటో, వీడియో, ఆడియో రూపంలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఫిర్యాదు అందిన రెండు గంటల్లో పరిష్కరించేలా వ్యవస్థను రెడీ చేశారు. అనుకున్న సమయానికి పనులు పూర్తికాకుంటే తొలుత ఫెసిలిటీ మేనేజర్‌, చీఫ్‌ ఫెసిలిటీ మేనేజర్‌కు, ఆ తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లేలా ఫిర్యాదు చేసేందుకు ఎస్కలేషన్‌ మ్యాట్రిక్స్‌ ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తానికి శ్రీవారి భక్తులకు నందకం ఇక తోడుగా నిలవనుంది.

Related News

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

Big Stories

Advertisement
×