E-Paper
Advertisement

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత
Advertisement

Tirumala News: శ్రీవారి బ్రహ్మోత్సావాలకు తిరుమల రెడీ అవుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ వైకుంఠం శ్రీనివాసుడ్ని చూసేందుకు భక్త లోకం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతుందని భావించిన టీటీడీ అధికారులు, ఆరు రోజులపాటు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేశారు.

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల అంగరంగ వైభవంగా ముస్తాబు అవుతోంది. అంతకుముందు నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం- ఎస్‌ఎస్‌డీ టోకెన్లను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 14 నుంచి అనగా సోమవారం నుంచి ఆరు రోజులపాటు ఈనెల 19వ ఆపేస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి క్యూలైన్ల ద్వారా స్వామిని దర్శనం చేసుకోవాలని తెలిపింది.

సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

Advertisement

మళ్లీ ఈనెల 21న దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను 20న జారీ చేయనున్నట్లు పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున టోకెన్ల కోసం ఆదివారం ఉదయం నుంచి భక్తులు వేచి ఉన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద క్యూ కట్టారు. టోకెన్లు జారీ లేదని అధికారులు సమాచారం ఇవ్వడంతో భక్తులు ఆవేదన వ్యక్తంచేశారు. తిరుపతినుంచి అందరూ తిరుమలకు బయలుదేశారు. వరుసగా ఆఫీసులు,పాఠశాలలకు సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

తిరుమలలో రద్దీ మాటేంటి?

ఆదివారం సమాచారం మేరకు సర్వ దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం రోజు దాదాపు 81,724 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చింది. మరోవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలతో పాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.

Advertisement

ALSO READ: మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా సెప్టెంబర్ 14న అంకురార్పణతో మొదలుకానుంది. 15న ధ్వజారోహణంతో మొదలై 23వ వరకు జరగనున్నాయి. అధికమాసం నేపథ్యంలో ఈసారి సాలకట్ల-నవరాత్రి బ్రహ్మోత్సవాలను రెండుసార్లు నిర్వహిస్తోంది టీటీడీ. ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15న సీఎం చంద్రబాబు దంపతులు తిరుమల రానున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 16న ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రికల్ బస్సులు, నందనం యాప్ ప్రారంభించనున్నారు. అలాగే భక్తులకు LIC పథకం, ఇంటిగ్రేటెడ్ పిలిగ్రీమ్ సెంటర్ను ప్రారంభించనున్నారు.

Related News

శ్రీవారి భక్తులకు ‘నందకం’ యాప్.. అయితే ఏంటి? ఆ టెన్షన్ అవసరం లేదుగా

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

Big Stories

Advertisement
×