E-Paper
Advertisement

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?
Advertisement

Nandyal JE: నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం రేపుతోంది.  కొలిమిగుండ్ల విద్యుత్ JE చింతా లక్ష్మణస్వామి ఈ నెల 8న ఆఫీస్‌ పనిమీద ఇంటినుంచి బయటకు వెళ్లారు. అప్పటినుంచి తిరిగి ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఏమైందోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

16 ఏళ్లుగా ఒకే చోట ఉద్యోగం..

Advertisement

కొలిమిగుండ్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో 16 ఏళ్లుగా లక్ష్మణస్వామి జేఈగా విధులు నిర్వహిస్తున్నారు. 8వ తేదీ రాత్రి కారు తీసుకుని ప్రమోషన్ ఉందంటూ, సంబంధిత పత్రాలు తిరుపతిలో సమర్పించాలని ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆదివారం నుంచే లక్ష్మణస్వామి మూడీగా ఉన్నారన్న ఆయన భార్య లీలావతి తెలిపారు. ఆఫీస్‌లోనే ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

Advertisement

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా? లేక విధి నిర్వహణలో ఒత్తిడా? అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా సైతం పరిశీలిస్తున్నారు.

Also Read: KTR, హరీష్‌రావులకు గద్దర్ అవార్డులు గ్యారెంటీ.. మాక్ అసెంబ్లీపై మెట్టు సాయికుమార్ సెటైర్లు!

Tags

Related News

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×