BigTV English

Nara Lokesh: రెడ్ బుక్ ఓపెన్ చేశా.. ఎవ్వరినీ వదిలిపెట్టను.. పరదాల పాలన అనుకుంటున్నారా.. లోకేష్ కామెంట్స్

Nara Lokesh: రెడ్ బుక్ ఓపెన్ చేశా.. ఎవ్వరినీ వదిలిపెట్టను.. పరదాల పాలన అనుకుంటున్నారా.. లోకేష్ కామెంట్స్

AP Minister Nara Lokesh: వైసీపీ నన్ను ఫాలో అవుతోంది.. అందుకే బుక్ అంటూ ఇటీవల ఒకరి తర్వాత ఒకరు ప్రకటనలు ఇస్తున్నారు వైసీపీ నేతలు. విమర్శలు కాదు మాకు ప్రజా సంక్షేమం ముఖ్యమన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్.
ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ యువగళం పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100కు పైగా భారీ బహిరంగ సభలలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఆ సభలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రెడ్ బుక్.


ఈ రెడ్ బుక్ గురించి నాటి సభల్లో లోకేష్ మాట్లాడుతూ.. ఎవరైతే చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ.. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారో .. వాటి పేర్లన్నీ రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి జిల్లాలో కూడా రెడ్ బుక్ ఓపెన్ చేశారు లోకేష్. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి.. టీడీపీ , జనసేన, బిజెపి కూటమి గా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. ఏకంగా ఎన్నడూ లేని రీతిలో 164 సీట్లలో విజయఢంకా మోగించాయి.

ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. నారా లోకేష్ కూడా ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తాజాగా వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తాను గ్రీన్ బుక్ రాస్తున్నట్లు.. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరి పేరు బుక్ లో రాస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మాజీ సీఎం జగన్ కూడా తాను గుడ్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. తమది రెడ్ బుక్ పరిపాలన కాదని, గుడ్ బుక్ పరిపాలన అంటూ మాట్లాడారు.

Also Read: Pawan Kalyan: మొన్న వచ్చారు.. ఏకంగా పవన్ పేరుతో బెదిరింపులు.. నిగ్గు తేల్చాలని పవన్ ఆదేశం

ఇలా జగన్ చేసిన కామెంట్స్ పై తాజాగా లోకేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తనను చూసి వైసీపీ స్ఫూర్తి పొందిందన్నారు. అయితే ఇప్పటికే రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని, తప్పు చేసిన ఏ అధికారిని, నేతలను వదిలి పెట్టేదిలేదు. గత సీఎం జగన్ పరదాలు కట్టుకొని పాలన సాగిస్తే.. తాము ప్రజాదర్భార్ ద్వారా ప్రజా సమస్యలను వింటూ పాలన సాగిస్తున్నామన్నారు.

విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధి ప్రభుత్వం అండదండగా నిలిచిందన్నారు. వరదసాయంపై వైసీపీ చేస్తున్న విమర్శల పట్ల.. పొరపాటు జరిగితే పేర్లు ఇవ్వండి.. మా తప్పు సరిదిద్దుకుంటాం.. అంతేకానీ అనవసరంగా విమర్శలు చేయడం తగదన్నారు. యుద్ధప్రాతిపదికన వరదల సమయంలో సాయం అందించడమే కాక.. నష్టపోయిన ప్రజలకు ఆర్థిక సాయం అందించామన్నారు. అయితే రెడ్ బుక్ యాక్షన్ ప్రారంభమైందని తెలిపిన లోకేష్ ఎవరినీ కూడా వదిలిపెట్టేది లేదని ప్రకటించారు. అయితే ఈ బుక్ లో నమోదైన వారి పేర్లపై లోకేష్ దృష్టి సారించారన్నమాట.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×