BigTV English

Anjaneyulu: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు

Anjaneyulu: జగన్… సిట్‌తో పాపాల పుట్ట పగలడం ఖాయం: జీవీ ఆంజనేయులు

MLA GV Anjaneyulu Serious on Jagan: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ పై వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ వివాదంపై జగన్ లేఖ రాయడాన్ని ఆయన ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడమేంటి? దానిపై ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని అడగాల్సింది కదా? జగన్ తప్పు చేసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సుబ్బారెడ్డికి స్వామి పట్ల ఎంత భక్తి ఉందో సేవల ధరల పెంపుతో దేశం మొత్తానికి అర్థమైంది. భూమన కరుణాకర్ రెడ్డి ఎంతటి స్వామి భక్తుడో ప్రజలందరికీ తెలుసు.. ఆయన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత వైసీపీ ప్రభుత్వం టీటీడీలో అధ్వానంగా వ్యవహరించింది. టీటీడీలో దొంగల ముఠాను పెట్టి లడ్డూల నుంచి అన్నప్రసాదాల వరకు… ఇలా అన్నిటినీ దోపిడీ చేశారు.


Also Read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

తమ పాలనలో అటువంటి తప్పేమీ జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు సహకరించొచ్చు కదా? మీరు నిజాయతీ ఉంటే.. మీ పాలనలో నిబంధనలను మార్చి ధర్మారెడ్డిని ఈవోగా ఎందుకు నియమించారు? అదేవిధంగా రూల్స్ ను చేంజ్ చేసి ప్రైవేట్ డైయిరీకి నెయ్యి కాంట్రాక్టును ఎందుకిచ్చారు? కేవలం నెయ్యి పేరిటే రూ. 450 కోట్లు దోచుకుంటే.. ఇగ శ్రీవారి సంపదలను ఎంత దోచుకున్నారో.. ఏం చేశారో అనేదానిపై కూడా విచారణ జరిపించాలి. వైసీపీ పాలనలో ఈ క్రిమినల్స్ నేతృత్వంలో ఆలయాల్లో ఏం జరిగిందో ఊహించుకుంటేనే భయమేస్తోంది? ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా జగన్ పాపాల పుట్ట అంతా బయటపడుతుంది. ప్రస్తుతం ప్రజలు జగన్ ను అధికారం నుంచే దించారు కానీ,.. ఆరోజు ఏకంగా రాష్ట్రం నుంచే తరిమికొడుతారు’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: తిరుమల లడ్డూ వివాదం, సిట్ ఏర్పాటు, వైసీపీ నేతలు ఇరుకున్నట్టే..

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×