BigTV English

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ

TTD clarity on adulterated ghee in Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తెలిసీ తెలియక దోషాలు జరిగాయన్నారు. ఈ దోషాలను తొలగించేందుకు శాంతి హోమం, సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా ఆలయంలోని అన్ని విభాగాల్లో శాంతి హోమం చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారికి మహానైవేద్యం పూర్తి చేశామని చెప్పారు.


ఇక నుంచి లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీటీడీ పేర్కొంది. మార్చిన నెయ్యితోనే లడ్డూలు తయారు చేస్తున్నామని వెల్లడించింది. ప్రసాదాల తయారీ కేంద్రాలతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ పూర్తి చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ప్రసాదం కల్తీ జరిగి ఉంటుందని చాలామంది భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే పవిత్రోత్సవాలకు ముందే నెయ్యిని మార్చినట్లు చెప్పారు. ఇకపై లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని టీటీడీ అధికారులు భక్తులకు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతోనే లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందని వెల్లడించారు. కానీ ఇంకా భక్తుల్లో ఆందోళన నెలకొందని, దీనిని తొలగించేందుకు శాంతి హోమం పూర్తి చేసినట్లు తెలిపారు.


Also Read: తిరుమలలో హోమం, నాలుగు గంటలపాటు..

ఇదిలా ఉండగా, లడ్డూ తయారీ కోసమే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ వెల్లడించింది. ఇందులో భాగంగానే స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది. స్వచ్చమైన నెయ్యి అవునా? కాదా? అనే విషయం తెలుసుకునేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ ఏర్పాటు చేసి పరీక్షిస్తున్నామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×