E-Paper
Advertisement

Pushpa 2 Release Date: ఆ రోజు ‘పుష్ప 2’ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Pushpa 2 Release Date: ఆ రోజు ‘పుష్ప 2’ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Advertisement

Pushpa 2 Release Date : గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయిన తర్వాత, ప్రపంచమంతటా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న తర్వాత హీరోలపై చాలా ప్రెజర్ పడుతుంది. ప్రతీ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఉండాలి, అందరికీ నచ్చేలా ఉండాలి, హిట్ అవ్వాలి.. ఇలా చాలా ఆలోచనలతో ఒక సినిమాను సైన్ చేస్తారు. ఇక అల్లు అర్జున్ కూడా అదే చేశాడు. ‘పుష్ప’ మూవీ రిలీజ్ అయినప్పుడు మొదట మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. కానీ మెల్లగా ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ లభించింది. దీంతో ‘పుష్ప’ సీక్వెల్‌పై చాలా ఒత్తిడి ఏర్పడింది. ఇప్పుడు కూడా అసలు ‘పుష్ప 2’ రిలీజ్‌పై క్లారిటీ లేదు. దీంతో మేకర్స్.. దీని రిలీజ్ డేట్‌పై ఒక క్లారిటీ ఇచ్చారు.

గతేడాది డిసెంబర్‌లో

Advertisement

‘పుష్ప’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడేళ్లు అయ్యింది. ఆ సినిమాను మధ్యలోని ఆపేసి మిగతాది సీక్వెల్‌లో చూసుకోమని ప్రకటించాడు దర్శకుడు సుకుమార్. దీంతో అసలు పుష్ప జీవితంలో తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ అది కుదరకపోవడంతో 2024 సమ్మర్‌కు పోస్ట్‌పోన్ అయినట్టు తెలిపారు. కానీ పోస్ట్‌పోన్ అయిన రిలీజ్ డేట్‌ను మాత్రం బయటపెట్టలేదు. ఫైనల్‌గా ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ వస్తుందని ప్రకటించి ఈసారి పక్కా అని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు.

Also Read: జానీ మాస్టర్ ఇష్యూ.. అల్లు అర్జున్ స్పందనపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత రవిశంకర్

Advertisement

పోస్ట్‌పోన్ అంటూ వార్తలు

ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ రిలీజ్ ఉంటుందని కౌంట్‌డౌన్ కూడా ప్రారంభించారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. కానీ మరోసారి సీన్ రివర్స్ అయ్యింది. మేకర్స్ ప్రకటించకముందే ‘పుష్ప 2’ రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతుందనే విషయం బయటికొచ్చింది. దీంతో పలు ఇతర సినిమాలు ఆ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఫైనల్‌గా మూవీ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యిందని డిసెంబర్ 6న ‘పుష్ప 2’ రావడం ఫిక్స్ అని మాట మార్చారు మేకర్స్. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో నమ్మకం పోయింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ మరొక ప్రకటన విడుదల చేశారు.

వారి మధ్య మనస్పర్థలు

‘పుష్ప 2’ రిలీజ్‌కు ఇంకా 75 రోజులు మాత్రమే ఉందంటూ మరొక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. దీంతో ఈసారి రిలీజ్ కన్ఫర్మ్ అని ఈ సినిమాపై ఆశలు పెట్టేసుకున్నారు ఫ్యాన్స్. కానీ ‘పుష్ప 2’ వల్లే అల్లు అర్జున్, సుకుమార్ మధ్య మనస్పర్థలు వచ్చేశాయని, అందుకే అల్లు అర్జున్ కూడా తన లుక్ మార్చుకొని ఫారిన్ వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. మరోవైపు ‘పుష్ప 2’ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని, ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కూడా ప్రారంభమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండిటిలో ఏది నమ్మాలో ఫ్యాన్స్‌కు సైతం అర్థం కావడం లేదు. మొత్తానికి అనుకున్నట్టుగానే డిసెంబర్ 6కు ‘పుష్ప 2’ విడుదల అయితే అదే హ్యాపీ అని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×