Money saving tips: ప్రతీ నెల కాస్త అయినా డబ్బులు పోగేద్దామని అకౌంట్లో డబ్బులు ఉంచినా, నెల చివరికి ఏదో ఖర్చులతో ఖాళీ ఖాతానే దర్శనమిస్తుంటుంది. ఎలాగైనా ఖర్చులపై ఓ కన్నేయాలని నోట్ రాద్దామనుకున్నా.. రెండు, మూడు రోజులకే మళ్లీ పాత కథే. అందుకే.. మీకు ఇలాంటి బాధ లేకుండా రోజువారీ ఖర్చు వేటికి, ఎంత అవుతుందో చిటికెలో చెప్పేసే యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంత లేదన్నా రోజూ ఏదో ఓ ఖర్చు తప్పనిసరిగా చేయాల్సిందే. మరి అలాంటప్పుడు… ఆ ఖర్చులపై క్యాష్ బ్యాక్ వస్తే. సూపర్ ఉంటుంది కదా. మరింకెందుకు ఆలస్యం ఈ యాప్ ట్రై చేయండి. దీనిలో.. రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, కిరాణా దుకాణాల్లో ఏమైనా పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్ వస్తుంది. Shell, KFC, Taco Bell వంటి 1 లక్షకు పైగా బ్రాండ్స్ తో షేరింగ్ ఉంది. కొనుగోలుకు ముందు ఆఫర్ ఎంచుకోండి కార్డు పేమెంట్ చేసి రసీదు అప్‌లోడ్ చేయండి. క్యాష్‌బ్యాక్ మీ ఖాతాకు వస్తుంది. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా గిఫ్ట్ కార్డుగా తీసుకోవచ్చు. తరచూ వాడితే సంవత్సరానికి వేల రూపాయలు ఆదా చేయవచ్చు.
బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి డేటా ఒకే డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. ఆటోమాటిక్‌గా ఖర్చులు గుర్తించి, పదే పదే వచ్చే బిల్లులు, అనవసర సబ్‌స్క్రిప్షన్లను గుర్తిస్తుంది.సేవింగ్స్ గోల్స్, కేటగిరీ వారీగా లిమిట్స్ సెట్ చేసుకోవచ్చు. బిల్లులు, సేవింగ్స్ తర్వాత మిగిలిన సొమ్ముల్ని చూపిస్తుంది. ఉచిత వెర్షన్‌తోనే మనకి కావాల్సిన చాలా ఫీచర్స్ వచ్చేస్తాయి. కావాలంటే సబ్ స్క్రిప్షన్ వెర్షన్ లో మరిన్ని సేవలు కూడా పొందొచ్చు.
మీ డబ్బును రహస్యంగా కరిగించే సబ్‌స్క్రిప్షన్లను కనిపెట్టే ఎక్స్ పర్ట్ ఈ యాప్. మన ఖర్చులు ట్రాక్ చేసి, రిపీట్ ఛార్జీలను హైలైట్ చేస్తుంది. ఉచితంలో ఒక బడ్జెట్ ట్రాకర్, అలర్ట్స్ ఉన్నాయి. ప్రీమియం వెర్షన్‌లో బిల్ నెగోషియేషన్, ఆటో క్యాన్సిలేషన్ సేవలు ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్ హంటింగ్‌లో Rocket Money టాప్!
ఖర్చులు త్వరగా నమోదు చేసి, బడ్జెట్ సెట్ చేసి, చార్టులతో రిపోర్టులు చూడొచ్చు. క్లౌడ్ బ్యాకప్, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, iOS & వెబ్ వెర్షన్ కూడా ఉన్నాయి. ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్. రోజువారీ ఖర్చులకు ఈ యాప్ బెస్ట్.
200కు పైగా క్యూట్ ఐకాన్లతో ఖర్చులు లాగ్ చేసుకోవచ్చు – ఫుడ్, ట్రావెల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా క్యాటగిరీలతో పాటుగా.. రోజు, వారం, నెలవారీ రిపోర్టులు, క్లౌడ్ బ్యాకప్, బయోమెట్రిక్ లాక్ ఉన్నాయి. ఆటో సింక్ లేకపోయినా, దాని ఫన్నీ డిజైన్ బడ్జెటింగ్‌ను ఆసక్తికరంగా మారుస్తుంది. అందుకే.. ఈ యాప్ ని సరదా, సరదాగా ఎంటర్ టైన్ అవుతూ, బడ్జెట్ ప్లానింగ్, ఖర్చులపై ఓ లుక్కేయొచ్చు.
ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని ఈరోజు నుంచే మీ డబ్బును స్మార్ట్‌గా నిర్వహించండి. చిన్న మార్పుతోనే పెద్ద ఆదా సాధ్యం!