IPL 2026: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ( RAJASTHAN ROYALS ) జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ( Sanju Samson ) చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్తున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. చెన్నై లోకి సంజు శాంసన్ వెళ్తే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కచ్చితంగా కెప్టెన్ అవసరం ఉంటుంది. దీంతో కెప్టెన్ ఎవరు ? అనే దాని పైన సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ధ్రువ్ జురెల్ ( Dhruv Jurel ) లేదా యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అవుతారని చెబుతున్నారు.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు శాంసన్ ( Sanju Samson ) వెళ్ళిపోతే, అతని స్థానంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ వస్తాడు. రాజస్థాన్ జట్టులో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టేందుకు దాదాపు నలుగురు అర్హులుగా కనిపిస్తున్నారు. సంజు శాంసన్ చెన్నైలో కి వెళ్తే రవీంద్ర జడేజా జట్టులోకి వస్తాడు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా ( Ravindra Jadeja) కూడా అయ్యే ఛాన్సులు ఉంటాయి. అలాగే ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్లే కాక రియాన్ పరాగ్ ను కెప్టెన్ చేయాలని మరి కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా ధ్రువ్ జురెల్ లేదా యశస్వి జైస్వాల్ ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా కెప్టెన్ అవుతారని క్రీడా విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇద్దరు యంగ్ ప్లేయర్లు. జట్టును లీడ్ చేసే సత్తా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా రాణిస్తున్నారు. కాబట్టి ఇద్దరిలో ఒకరికి వస్తే బాగుంటుందని చెబుతున్నారు అభిమానులు. ఇక రియాన్ పరాగ్ కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతాడు. బలుపు కూడా ఎక్కువే. అంతర్జాతీయ క్రికెటర్ లో పెద్దగా అతనికి అవకాశం రావడం లేదు. అందుకే అతన్ని కెప్టెన్ గా నియామకం చేసే ఛాన్స్ లేనట్లే చెబుతున్నారు. ఇక కొత్తగా రవీంద్ర జడేజా జట్టులోకి వస్తే, అతనికి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ అతని వయసు 37 సంవత్సరాలు. ఈ వయసులో కెప్టెన్సీ ఇచ్చి అతన్ని ఇబ్బంది పెట్టడం రాజస్థాన్ రాయల్స్ కు ఇష్టం లేదట. అలాగే వచ్చే సీజన్ వరకు అతడు రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకే యశస్వి జైస్వాల్ లేదా ధ్రువ్ జురెల్ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ రానుందని సమాచారం.
🚨 Yashasvi Jaiswal and Dhruv Jurel have emerged as the leading contenders to captain Rajasthan Royals, with Sanju Samson likely to part ways with the franchise. 🏏 (TOI) pic.twitter.com/lus3Tij1mv
— CricketGully (@thecricketgully) November 10, 2025