Dates Benefits: ఖర్జూరం మన ఆరోగ్యానికి అద్బుతమైన సహజ ఔషధం. దీనిని మనం కొన్నిసార్లు జ్యూసుల్లోనో లేదంటే స్వీట్స్‌లోనో, కొన్నిసార్లు నేరుగానే తింటుంటాం. అయితే, ఈ ఖర్జూరం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు అనేక రకాలు పోషకాలను కలిగి ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్‌ను తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగపరచడంలో తోడ్పడుతుంది. దీంతో మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖర్జూరాన్ని నేరుగా లేదా జ్యూసులు, సలాడుల్లో కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి చాలా మంచింది.
ఖర్జూరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది వ్యాయామం చేసేవారికి బెస్ట్ ఛాయిస్. శారీరక శ్రమ చేసి అలసిపోయినప్పుడు ఖర్జూరం తింటే.. తక్షణ శక్తి లభిస్తుంది. నీరసంతో బాధపడేవారు కూడా రోజుకు రెండు ఖర్జూరాలు తీసుకుంటే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
కీళ్ల సమస్యలతో బాధపడేవారు కూడా ఖర్జూరాన్ని రోజుకు రెండు నుంచి మూడు తీసుకోవచ్చు. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. ఎముకలు దృఢంగా మారడానికి, ఆస్టియోపొరోసిస్ సమస్యలు ఉన్నవారికి ఈ డ్రై ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు ఒక ఖర్జూర్జాన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల.. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఖర్జూరంలో ఉండే యాంటీఆక్సిడెంట్‌లు, మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. రోజుకు రెండు నుంచి మూడు ఖర్జూరాలు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఖర్జూరంలో ఐరన్ ఎక్కువ కాబట్టి.. రక్తహీనతతో బాధపడేవారికి చాలా ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా మహిళలలు నెలసరి సమస్కలో కలిగే సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఖర్జూంతో మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్‌లు అల్జీమర్స్, న్యూరోడిజెనరేటివ్ వ్యాధులను తగ్గిస్తాయి. సీజనల్‌గా వచ్చే జర్వం, దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరవు. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటుంది.