BigTV English

YS Jagan: రెడ్‌బుక్‌పై తొలిసారి స్పందించిన జగన్..

YS Jagan: రెడ్‌బుక్‌పై తొలిసారి స్పందించిన జగన్..

వైసీపీలో రెడ్ బుక్ కలకలం మొదలైంది. యువగళం పాదయాత్ర సమయంలో ప్రస్తుత మంత్రి ఈ రెడ్ బుక్ గురించి ప్రకటించారు. అక్రమ కేసులు, ఓవరాక్షన్ చేసిన అధికారులు, వైసీపీతో అంటకాగి ఇష్టానుసారం ప్రవర్తించిన ఉన్నతస్థాయి అధికారుల పేర్లన్నీ ఇందులో ఉన్నాయని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చాక లోకేష్ కూడా జాతీయ మీడియా వేదికగా ఆ రెడ్‌ బుక్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

పార్టీ కార్యకర్తలు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని లోకేష్ స్పష్టం చేశారు. అయితే లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రకటించినప్పుడు వైసీపీ నేతలు సెటైర్లు విసురుతూ ఎద్దేవా చేశారు. అయితే మాజీ సీఎం జగన్ మాత్రం దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయనెప్పుడూ ఈ రెడ్ బుక్ వ్యవహారంపై స్పందించిన దాఖలాల్లేవు.


తాజాగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి పాతిక లక్షలు ఖర్చుపెట్టుకుని వచ్చారు మాజీ ముఖ్యమంత్రి  పిన్నెల్లిని కలిసొచ్చాక మీడియాతో మాట్లాడిన జగన్.. ఈ రెడ్ బుక్‌పై తొలిసారి స్పందించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు కూడా చేస్తున్నారని ఆరోపించారు.

Also Read: జగన్ కొత్త పలుకులు.. షాక్ లో వైసీపీ

ఎన్నికల ఫలితాల ముందే పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ చంద్రబాబు అక్రమంగా పెట్టించారంటున్న జగన్.. ఓటమి తర్వాత మొదటి సారి ప్రతిపక్షనేత పాత్ర పోషించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి, అసలు ఎన్ని అప్పులున్నాయో కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ అంతుపట్టడం లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుచేషన్ చేసిన అపరచాణక్యుడు సీఎం చంద్రబాబే గత అయిదేళ్లలో ఏం జరిగిందో అర్థం కావడం లేదంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకటో తేదీనే ఫించన్లు పంపిణీ చేసింది కూటమి సర్కారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు పెంచిన మొత్తాలతో ఇంటింటికి వెళ్లి డబ్బులు అందజేపింది. అది మింగుడు పడనట్లు బడులు ప్రారంభమైనా అమ్మ ఒడి ఇవ్వడం లేదని మిగిలిన పథకాల బటన్‌లు ఇంకా నొక్కలేదని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. మొత్తమ్మీద వైసీపీకి రెడ్ బుక్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఆ తడబాటుతోనే పిన్నెల్లికి జగన్ క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×