iQoo Neo 9s Pro+ Launching on July 11: ప్రముఖ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ ఈ ఏడాది మే నెలలో iQoo Neo 9s Pro స్మార్ట్‌ఫోన్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ SoC ప్రాసెసర్‌తో రిలీజ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మరొక కొత్త ఫోన్‌తో మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇది తన కొత్త iQoo Neo 9s Pro+ లాంచ్ తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించింది. కొత్త iQoo Neo 9s Pro+ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. iQoo Neo 9s Pro+ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ iQoo వాచ్ GT, iQoo 1i TWS ఇయర్‌బడ్స్‌తో పాటు విడుదల కాబోతుంది.
iQoo Neo 9s Pro+ జూలై 11న సాయంత్రం 7:00 గంటలకు (4:30pm IST) యూనివర్సల్ స్టూడియోస్ బీజింగ్‌లో లాంచ్ జరుగుతుందని iQoo వెల్లడించింది. లాంచ్ ఈవెంట్‌లో iQoo వాచ్ GT, iQoo ప్యాడ్ 2 ప్రో, iQoo 1i TWS ఇయర్‌ఫోన్‌లను కూడా లాంచ్ చేయనుంది. iQoo Neo 9s Pro+ బఫ్ బ్లూ, ఫైటింగ్ బ్లాక్, స్టార్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి. బ్లూ కలర్ వేరియంట్ డ్యూయల్ టోన్ డిజైన్‌ను కలిగి ఉంది.
iQoo Neo 9s Pro+ Specifications
Vivo వైస్ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ iQoo Neo 9s Pro+ ఫోన్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు. ఆప్టిమైజ్ చేయబడిన గేమింగ్ అనుభవం కోసం ఇది Vivo సెల్ఫ్ డెవలప్‌డ్ గేమింగ్ చిప్ Q1తో పాటు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని అన్నారు.
Also Read: ఐక్యూ నుంచి మూడు కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లు అదుర్స్!
ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. OriginOS 4.0లో రన్ అవుతుంది. ఇది 120W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు తెలిపారు. ఈ హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. iQoo వాచ్ GT AI ఫీచర్‌లతో వస్తుందని తెలిపారు. అదే సమయంలో iQoo ప్యాడ్ 2 ప్రో కంపెనీ మొదటి 1TB స్టోరేజ్ టాబ్లెట్‌గా ప్రారంభించబడుతోంది.