BigTV English

Rahul Meets Hathras Stampede victims: హాథ్రాస్‌‌లో రాహుల్.. బాధితులకు పరామర్శ

Rahul Meets Hathras Stampede victims: హాథ్రాస్‌‌లో రాహుల్.. బాధితులకు పరామర్శ

Rahul Gandhi Meets Hathras Stampede Victims(Telugu flash news): హాథ్రాస్‌‌ ఘటనను తాను రాజకీయం చేయడానికి తాను ఇక్కడకు రాలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. ఈ ఘటన వెనుక వ్యవస్థలోని చాలా లోపాలు ఉన్నాయన్నారు. చనిపోయిన కుటుంబాలు చాలావరకు నిరుపేదలని, వారికి మరింత ఆర్థిక సహాయం చేయాలని ముఖ్య మంత్రి కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.


కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హత్రాస్ వెళ్లారు. రెండురోజుల కిందట సత్సంగ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి ఇంట్లోకి వెళ్లి బాధితులతో కూర్చొని మాట్లాడారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నవారిని కోల్పోయామని ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. వారి కష్టాలను విన్న యువనేత రాహల్‌గాంధీ చలించిపోయారు.

ALSO READ: కోటాలో వరుస ఆత్మహత్యలు… బీహార్ విద్యార్థి సూసైడ్


అనంతరం మాట్లాడిన రాహుల్‌గాంధీ.. ఇది చాలా బాధాకరమైన ఘటనగా పేర్కొన్నారు. చాలామంది చనిపోయారని, అనేకమంది దిక్కులేని అనాధలుగా మిగిలిపోయారన్నారు. ఈ విషయంలో బాధితులకు తాము అండగా ఉంటామన్నారు. అలాగే పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

జూలై 2న ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ ప్రాంతంలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమం జరిగింది. దీనికి యూపీలోని పల్లెటూళ్ల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. పరిమితికి మించి అక్కడి భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన తర్వాత సత్సంగ్ నిర్వాహకుడు భోలె బాబా అలియాస్ సూరజ్‌పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు.

 

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×