E-Paper
Advertisement

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!
Advertisement

Nellore Accident: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై రాచర్లపాడు వద్ద రాత్రివేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్‌ను వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతులను ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లాలోని రాంనగర్ గ్రామానికి చెందిన శీతాకాంత్ (23), బాదల్ మహలిక్ (24)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ స్థానిక బి.ఎమ్.ఆర్ హేచరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.

Advertisement

అందరినీ తీవ్రంగా కలచివేసిన విషయమేమిటంటే… మృతుల్లో ఒకరైన బాదల్ మహలిక్ పుట్టినరోజు రోజే ఈ విషాదం చోటుచేసుకోవడం. బర్త్‌డే వేడుకల కోసం రాజుపాలెంలో కేక్ తీసుకుని, తిరిగి బి.ఎమ్.ఆర్ హేచరీకి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. సంతోషంగా కేక్ కట్ చేయాల్సిన సమయంలో విధి ఆడిన వింత నాటకానికి ఇద్దరు యువకుల నూరేళ్ల జీవితాలు బాటలోనే ముగిసిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: వీడేవడండీ బాబోయ్! ముసలిని భుజంపై మోసుకెళ్తున్నాడు.. వీడియో వైరల్!

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×