E-Paper
Advertisement

Srikakulam News: ఉత్తరాంధ్రకు మరో విమానాశ్రయం.. ముందుకొచ్చిన ఏఏఐ

Srikakulam News: ఉత్తరాంధ్రకు మరో విమానాశ్రయం..  ముందుకొచ్చిన ఏఏఐ
Advertisement

Srikakulam News:  జిల్లాకు ఓ ఎయిర్‌పోర్టు ఉండాలన్నది సీఎం చంద్రబాబు డ్రీమ్.  ఎయిర్‌పోర్టుకు రైల్వేలు, నేషనల్ హైవేలు కనెక్టివిటీ  ఉండాలన్నది మరో ప్రధాన ఆలోచన.  అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్. దీనికి సంబంధించి తెర వెనుక వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం AAI–APADC (ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

శ్రీకాకుళంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు

Advertisement

విశాఖ వేదికగా శుక్ర, శనివారాల్లో సీఐఐ సదస్సు జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం చంద్రబాబు- కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కార్గో సౌకర్యాలతో కూడిన ఎయిర్‌పోర్టు ఇది. ఈ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభమైంది.

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీని పెంచుతుందని సీఎం చంద్రబాబు ఆలోచన. అంతేకాదు ఆర్థిక వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు. విమానాశ్రయ ప్రాజెక్ట్ మౌలిక సదుపాయాలు, అనుమతులపై AAI-APADC కలిసి పని చేయనున్నాయి.  శ్రీకాకుళం-పలాస మధ్య దీన్ని నిర్మించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జీడిపప్పుకు పలాస కేంద్రంగా ఉంది.

Advertisement

కార్గోకు కలిసి వస్తుందని అంచనా

ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్టు 2026 నాటికి కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళానికి ఎయిర్‌పోర్టు వస్తే ఉత్తరాంధ్ర ఆర్థికాభి వృద్ధికి బలమైన కేంద్రంగా ఎదుగుతుందని భావిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు నీటి సమస్య లేదు. రెండు లేదా మూడు నదులు ఆ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో భారీగా రైస్ పండుతోంది.  ఆ తర్వాత కమర్షియల్ పంటలకు కొదవేలుద. అక్కడి నుంచి ఎగుమతి చేయడానికి ఎయిర్‌పోర్టు ఉపయోగపడుతుందని ఓ అంచనా.  విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల మధ్య చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల మధ్య ఫార్మా రంగం విస్తరించింది కూడా.

ALSO READ: బహుమతి ఇస్తానన్న లోకేష్.. ఎవరికీ తెలియని సమాధానం

అక్కడి నుంచి ఎగుమతి చేయాలంటే నేరుగా విశాఖకు రావాల్సిందే. అక్కడే కార్గో తరహాలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తోంది. శనివారం కార్డెలియా క్రూయిసెస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ తీరప్రాంత పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి సహకరించాలన్నారు. ముఖ్యంగా విశాఖ, భీమునిపట్నం,కాకినాడ ఓడరేవుల నుండి క్రూయిజ్ టూరిజం సేవలపై చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకమైన క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం మరియు వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై కార్డెలియా క్రూయిసెస్ ఆసక్తి చూపింది.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×