E-Paper
Advertisement

Lokesh New Jacket: బహుమతి ఇస్తానన్న లోకేష్, అయినా ఎవరికీ తెలియని సమాధానం

Lokesh New Jacket: బహుమతి ఇస్తానన్న లోకేష్, అయినా ఎవరికీ తెలియని సమాధానం
Advertisement

మంత్రి నారా లోకేష్ సరదాగా ట్విట్టర్ లో నెటిజన్లకు ఓ ప్రశ్న సంధించారు. CII సదస్సుకి ఆయన రెగ్యులర్ ఫార్మేట్ డ్రస్ పై స్లీవ్ లెస్ కోటు ధరించి వచ్చారు. తొలిరోజు కంటే రెండోరోజు ఆయన ధరించిన కోటు కాస్త ప్రత్యేకంగా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అని ఆయన నెటిజన్లను ప్రశ్నించారు.

నా కొత్త జాకెట్ ఎలా ఉంది?
అది దేనితో తయారు చేయబడిందో మీరు ఊహించగలరా? మీ సమాధానాన్ని ఈ ట్వీట్ కింద తెలపండి. సరైన సమాధానం చెబితే మీకు ఆశ్చర్యకరమైన బహుమతి లభిస్తుంది. అంటూ ఓ ట్వీట్ వేశారు లోకేష్.

Advertisement

లోకేష్ ట్వీట్ కి ఆసక్తికర సమాధానాలు

Advertisement

నారా లోకేష్ ట్వీట్ కి చాలామంది సమాధానాలు చెప్పారు. అది చేనేత గుడ్డతో తయారు చేసిందని, ఇంకెక్కడో నేత నేసి తీసుకొచ్చిందని, మేలు రకమైన దారంతో తయారు చేసిందని, ఇలా రకరకాల సమాధానాలు చెప్పారు. అయితే అందరూ లోకేష్ ఆ డ్రెస్ లో అదిరిపోయేలా కనిపించారని అన్నారు. లోకేష్ రెగ్యులర్ డ్రస్సింగ్ స్టైల్ కి ఆ క్లాత్ మరింత అందాన్నిచ్చిందని అన్నారు. అయితే ఆ క్లాత్ ఎక్కడిది, ఎవరు చేసింది, ఎలా చేసింది అనేది మాత్రం చెప్పలేకపోయారు. చాలా సమాధానాలు వచ్చాయి కానీ అవేవీ కరెక్ట్ కాదు. దీంతో ఆయనే ఆ సమాధానాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన బహుమతిని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేకపోయారంటూ ఆయన అసలు విషయం బయటపెట్టారు.

పులగుర్త స్పెషల్ క్లాత్..
తాను వేసుకున్న జాకెట్ మిలన్ లేదా ముంబై నుంచి తెచ్చింది కాదని, తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి మండలం పులగుర్త అనే చిన్న గ్రామం నుండి వచ్చిందని చెప్పారు. స్థానికంగా చేతితో తయారు చేసిన ఖాదీ, ముల్ క్లాత్ యొక్క మిశ్రమం అన్నారు. గాలిలా మృదువైన వస్త్రం అదని చెప్పారు. కొన్నిసార్లు, ఉత్తమ శైలి కథలు ఇంట్లోనే అల్లబడతాయని ఆ వస్త్రాన్ని తయారు చేసిన చేనేతలకు ధన్యవాదాలు తెలిపారు లోకేష్.

CII సదస్సుకి వచ్చిన చాలామంది విదేశీ ప్రతినిధులు కూడా మన చేనేత వస్త్రాలపై మనసు పారేసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రతినిధి మంగళగిరి చేనేత చీరను ధరించడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను మంగళగిరి చీరలకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రస్తావించారు. మన చేనేత వస్త్రాలకు ప్రపంచ ఖ్యాతి ఉందని చెప్పారాయన.

Also Read: వైజాగ్ కి చంద్రబాబు కొత్త నిర్వచనం..

విశాఖలో జరిగిన 30వ CII భాస్వామ్య సదస్సు ఏపీకి దాదాపు రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సదస్సుకి ముందే ఏపీకి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అధికారులు, నేతలు అంచనా వేశారు. ఆ అంచనాకు తగ్గట్టే పెట్టుబడులు వచ్చాయి. వివిధ విదేశీ కంపెనీలు, స్వదేశీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. భారీ పరిశ్రమలు ఎంఎస్ఎంఈ రంగ పరిశ్రమలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. త్వరలోనే ఈ ఒప్పందాలు అమలవుతాయని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.

Also Read: జూబ్లీ హిల్స్ గుణపాఠం.. కేటీఆర్ ఇకనైనా గ్రౌండ్ రియాల్టీ అర్థం చేసుకుంటారా?

Also Read: రేవంత్ నాయకత్వానికి ఢోకా లేనట్టే

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×