Delhi Crime Season 3 : షెఫాలీ షా, హుమా ఖురేషి నటించిన ‘ఢిల్లీ క్రైమ్ 3’ సీజన్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఇదివరకే వచ్చిన రెండు సీజన్‌ల విజయం తర్వాత, ఈ మూడవ సీజన్ కూడా నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందింది. ఎమ్మీ అవార్డు గెలుచుకున్న ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఇందులో షెఫాలీ షా డిజిపి వర్తికా చతుర్వేదిగా తన ఐకానిక్ పాత్రను తిరిగి పోషించింది. ఢిల్లీ క్రైమ్స్ 3 లో ఎలాంటి నిజమైన సంఘటనలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి 2012 జనవరి 18న, 15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో ఉన్న రెండేళ్ల బాలికతో వచ్చింది. వైద్యులు బాలికను పరీక్షించినప్పుడు, ఆమె రెండు చేతులు విరిగిపోవడం, తలపై లోతైన గాయం, ఆమె బుగ్గలపై గాట్లు, కాలిన గాయాల గుర్తులు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఈ యువతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక మెదడులో రక్తం గడ్డకట్టిందని, కోమాలో ఉందని వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చిన మహిళ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితురాలే అని తెలుసుకున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని బాలిక తల్లిని కనిపెడతారు. ఉద్యోగం, వివాహం పేరుతో ఆమె తల్లి మున్నీని ఢిల్లీకి రప్పించారని తేలుతుంది. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత, ఆమె ముగ్గురు పిల్లలను వేర్వేరు ప్రదేశాలకు అమ్మేసినట్లు తెలుసుకుంటారు. ఆముగ్గురిలో ఒకరైన పాపే హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉంటుంది.
ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చిన 15 ఏళ్ల బాలికే ఆమె ఈ దుస్థితికి కారణమని తెలుసుకుని అందరూ మరింత షాక్ అయ్యారు. ఆమె కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితురాలు. ఆమె ప్రియుడిచే పదేపదే వేధింపులకు గురైంది. ఆ బాలిక ఏడ్చినప్పుడు, కోపంతో ఆమెను కొట్టి, కొరికి, ఆమె బుగ్గలను తగలబెట్టింది. ఈ విషయం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పించింది. అందరూ ఆ బాలిక కోసం ప్రార్థించారు.
Read Also : వరల్డ్ ప్రీమియర్లో 9 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్… జాన్వీ కపూర్ నటించిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ కేసు ఆ అమ్మాయి తల్లితో సహా ఒక పెద్ద మానవ అక్రమ రవాణా ముఠాను బయటపెట్టింది. ఆమెను కొని అమ్మిన వ్యక్తులు కూడా ఇదే విధంగా అనేక మంది బాలికలను మహిళలను మోసం చేసి విక్రయించారు. ఆ రెండేళ్ల బాలిక దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేసింది. అయితే ఒక రోజు రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆ తరువాత వైద్యులు ఆమెను రక్షించలేకపోయారు. తరువాత పోలీసులు 15 ఏళ్ల బాలికను, ఆమె ప్రియుడిని ఇతరులను అరెస్టు చేశారు. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. ఈ సంఘటన ఒక పెద్ద మానవ అక్రమ రవాణా ముఠాను బయట పెట్టింది.
ఈ సీజన్ లో షెఫాలీ షా, హ్యూమా ఖురేషి, రాజేష్ తైలాంగ్, రసిక దుగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ నెట్ ఫ్లిక్స్ లో 2025 నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తనూజ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సీజన్ మొత్తం 6 ఎపిసోడ్స్ లో ఉంది. ప్రతీ ఎపిసోడ్ 45 నిమిషాలకి పైగా ఉంటుంది. ఈ సిరీస్ లో హుమా ఖురేషి బాలికల అక్రమ రవాణాలో పాల్గొన్న ముఠా నాయకురాలిగా నటించింది.