E-Paper
Advertisement

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్: రూ. లక్ష వరకు వివాహ రుణం.. దరఖాస్తు చేసుకోండి ఇలా!

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్: రూ. లక్ష వరకు వివాహ రుణం.. దరఖాస్తు చేసుకోండి ఇలా!
Advertisement

NTR Kalyana Lakshmi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం ఆర్థికంగా భారంగా మారకూడదనే సదుద్దేశంతో ‘ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి’ పథకాన్ని మే 23, 2026 నుంచి ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. మహిళా సంఘాల్లోని సభ్యుల కుమార్తెల పెళ్లిళ్ల కోసం ఆర్థిక వెసులుబాటు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. గతంలో వివాహ సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు అత్యంత వేగవంతమైన రుణ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు రుణాన్ని కేవలం 25 పైసల వడ్డీకే (పావలా వడ్డీ) అందజేస్తారు. తీసుకున్న రుణాన్ని తిరిగి 48 నెలవారీ వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించనుంది ప్ర‌భుత్వం.

ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే వారు కనీసం ఆరు నెలల పాటు డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా కొనసాగాలి. గతంలో సంఘం ద్వారా తీసుకున్న బ్యాంకు లింకేజీ లేదా స్త్రీ నిధి వంటి రుణాలను సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ఈ రుణ అర్హత లభిస్తుంది. వివాహ వయస్సు నిబంధనల ప్రకారం పెళ్లి కుమార్తెకు 18 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సరళీకృతం చేసింది. లబ్ధిదారులు లగ్న పత్రిక తో పాటు వధూవరుల ఆధార్ కార్డులు, వయస్సు ధృవీకరణ పత్రాలు, వివాహ ఖర్చుల అంచనా పత్రాలతో తమ పరిధిలోని వెలుగు కార్యాలయం లేదా వీఓఏ (VOA) వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించిన కేవలం 48 గంటల వ్యవధిలోనే బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేసి నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

Advertisement

అంతేకాకుండా ఈ పథకంలో భద్రతకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. రుణం తీసుకున్న సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ రుణాన్ని ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేస్తుంది. సెర్ప్ (SERP), స్త్రీ నిధి బ్యాంక్ సమన్వయంతో ఈ కార్యక్రమం అమలవుతోంది. ప్రతి ఏటా సుమారు 25 వేల మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా ఆడపిల్ల పెళ్లిని గౌరవప్రదంగా నిర్వహించుకునే ధైర్యాన్ని ఈ పథకం ఇస్తోంది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: రూ.40వేల లోపు బెస్ట్ LG ఫ్రిజ్‌లు.. అదిరిపోయే కూలింగ్, భారీగా కరెంటు ఆదా, ఎక్కడంటే?

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×