Viral Video : జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా మాట్లాడటం మంచిది కాదన్నారు. ఆ దేశం మీద అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్‌కే వెళ్లిపోండని సూటిగా చెప్పారు. అలాంటిది లేటెస్ట్‌గా ఏపీలో పాకిస్తాన్ మద్దతుదారులు హల్‌చల్ చేయడం కలకలం రేపుతోంది.
మనుషులా వాళ్లు.. సైతాన్‌లు. పహల్గాంలో 26 మందిని అన్యాయంగా కాల్చి చంపారు. హిందువులో కాదో కన్ఫామ్ చేసుకుని మరీ ఉగ్రవాదులు తెగబడ్డారు. మహిళలు, పిల్లలు కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు ఆ కిరాతకులు. టెర్రరిస్టుల మారణహోమంపై యావత్ భారతం రగిలిపోతోంది. ఉగ్రవాదుల భరతం పట్టాలని పంతం పడుతున్నారు. ఉగ్రదాడిపై భారతీయులంతా ఏకం కావాల్సిన సమయంలో కొందరు మాత్రం కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం అవసరం లేదని.. ఉగ్రవాదానికి మతం లేదని.. హిందుత్వం వల్లే టెర్రరిజం అంటూ రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సెక్యులరిజం ముసుగులో పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏపీలో ఏం జరిగిందంటే…
ధర్మ రక్షా దళ్ ఆందోళన
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నంద్యాలలో ధర్మ రక్షా దళ్ తరఫున పలువురు యువకులు నిరసన ప్రదర్శన చేశారు. పాక్ జెండాలను రోడ్డుపై పడేసి.. వాటిని తొక్కిపడేసి.. ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ డౌన్ డౌన్.. ఇండియా జిందాబాద్.. అంటూ నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ.. పాక్‌పై మండిపడ్డారు. ఇంత వరకూ బానే ఉంది… ఆ తర్వాతే అసలు సీన్ కనిపించింది….
పాక్ జెండాలను తీసి..
ఇండియాలో పాకిస్తాన్‌కు సపోర్టర్స్ ఉండరేమోనని అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటిది అస్సలు ఊహించలేం. కానీ, ఏపీలోనూ పాక్ మద్దతుదారులు ఉన్నారు. ఇది నిజం. నమ్మశక్యం కాని నిజం. నంద్యాలలో ధర్మరక్షా దళ్ సభ్యులు నిరసన నిర్వహించి.. పాక్ జెండాలను రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఓ వర్గం యువకులు ఆ జెండాలను ఎవరూ తొక్కకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టారు. అలా ఆ దేశంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
Also Read : పాక్ చెరలో భారత జవాన్.. ఎంత టార్చర్ చేస్తున్నారంటే..
పాక్‌పై అంత అభిమానమా?
నంద్యాలలో పాక్ జెండాలను సంరక్షించేంత వీరాభిమానులు ఉన్నారనే విషయం ఈ ఘటనతో వెలుగుచూసింది. కొందరు యువకులు రోడ్డుపై ఉన్న పాక్ జెండాలను ఏరి జాగ్రత్త చేస్తున్న దృశ్యం పక్కనే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఆ యువకులు ఎవరంటూ ఆరా తీస్తున్నారు. పహల్గాంలో 26 మందిని కాల్చి చంపాక కూడా.. పాకిస్తాన్‌పై ప్రేమ చాటుకుంటున్నా ఆ యువకులను ఏమనాలి? ఏం చేయాలి?
పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్న కొందరు యువకులు
నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో కొందరు యువకులు పాకిస్తాన్ జెండాను ప్రేమిస్తున్నారు. కాశ్మీర్ ఘటన తర్వాత కూడా ఈ చర్య ఖండనీయం. సొంత దేశంలో విదేశీ జెండా ప్రేమ ఆందోళన కలిగిస్తోంది. వీరిపై చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. pic.twitter.com/3H3E85A2VN
— ChotaNews App (@ChotaNewsApp) May 1, 2025