BigTV English

India vs Pakistan : పాక్ చెరలో భారత జవాన్.. ఎంత టార్చర్ చేస్తున్నారంటే..

India vs Pakistan : పాక్ చెరలో భారత జవాన్.. ఎంత టార్చర్ చేస్తున్నారంటే..

India vs Pakistan : పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 26 మంది హిందువులను కాల్చి చంపారు. వెంటనే ఆ న్యూస్ దేశమంతా హోరెత్తింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మీడియాలో నాన్‌స్టాప్ కవరేజ్. అయితే, అదే రోజు మరో దురదృష్టకర సంఘటన కూడా జరిగింది. పహల్గాం ఘాతుకంలో పడి.. ఆ ఉదంతానికి అంతగా ప్రచారం రాలేదు. అదేంటంటే…


బోర్డర్ క్రాస్ చేసిన జవాన్

పీకే సాహు. 182 బెటాలియన్‌కు చెందిన BSF జవాన్. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో పహారా కాస్తున్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ దగ్గర అతని డ్యూటీ. రెగ్యులర్ గస్తీలో భాగంగా ఆ రోజు అతను సరిహద్దుల్లో ఒక్కడే నిఘా చేపట్టాడు. అయితే, అనుకోకుండా ఆ సోల్జర్ పాకిస్తాన్ సరిహద్దు దాటేశాడు. సుమారు 2 కిలోమీటర్ల దూరం పాక్ భూభాగంలోకి వెళ్లాడు. ఇదే అదనుగా పాకిస్తాన్ బలగాలు మన బీఎస్‌ఎఫ్ జవాన్ను అదుపులోకి తీసుకున్నాయి. ఇక ఆట మొదలైంది.


పాక్ డ్రామా షురూ..

జవాన్ పీకే సాహు పొరబాటున బోర్డర్ దాటాడని.. వదిలేయమని బీఎస్‌ఎఫ్ అధికారులు పాక్ రేంజర్లతో చర్చలకు ముందుకొచ్చారు. అదే సమయంలో పహల్గాం ఉగ్రదాడి విషయం బయటకు వచ్చింది. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. యుద్ధం, సర్జికల్ స్ట్రైక్స్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతటి హైటెన్షన్‌లో సాహు విడుదల సందిగ్థంలో పడింది. పాకిస్తాన్ డ్రామా స్టార్ట్ చేసింది.

పాక్ శాడిజం

బీఎస్‌ఎఫ్ జవాన్ రిలీజ్ కోసం వారం రోజులుగా ఇండియన్ ఆర్మీ.. పాక్ ఆర్మీ అధికారులను సంప్రదిస్తూనే ఉంది. ఇరు దేశాల రేంజర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఎటూ తేల్చడం లేదు పాకిస్తాన్. తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని.. వారి నుంచి ఇంకా ఆదేశాలు రాలేదంటూ.. చర్చలను మధ్యలోనే ఆపేస్తున్నారు పాక్ రేంజర్లు. ఇలా ఒకటీ రెండు రోజులు కాదు. వారం రోజుల నుంచీ చర్చలు మమ అనిపిస్తున్నారు. ప్రతీ రోజూ మీటింగ్ జరుగుతోంది. పావు గంటలోనే మేటర్ క్లోజ్ చేస్తున్నారు. రోజూ ఏదో ఒక కుంటి సాకులే చెబుతున్నారు. పైనుంచి ఆదేశాలు రాలేదంటూ తప్పించుకుంటోంది పాక్.

సోల్జర్ సేఫేనా?

సరిహద్దుల్లో అప్పుడప్పుడూ జవాన్లు ఇలా పొరబాటున LoC ని క్రాస్ చేయడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకున్నా.. చర్చలతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. గతంలో ఇలా చాలా సందర్భాల్లోనే జరిగింది. కానీ, ఈసారి మాత్రం పాక్ అదును చూసి ఇండియన్ ఆర్మీని టార్చర్ చేస్తోంది. సాహును విడిచిపెట్టకుండా.. కావాలనే బాగా సాగదీస్తోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో బోర్డర్ దాటిన బీఎస్‌ఎఫ్ జవాన్ పీకే సాహు పరిస్థితి క్లిష్టంగా మారింది. పాక్‌తో ఇండియన్ ఆర్మీ జంగ్ సైరన్ మోగిస్తే.. సాహు ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనే టెన్షన్ మొదలైంది. ఇంతకీ పాక్ అదుపులో ఉన్న మన సోల్జర్ సేఫేనా? మరో అభినందన్ వర్థమాన్‌గా సురక్షితంగా తిరిగొస్తారా?

Also Read : బంగ్లాదేశ్ బోర్డర్‌లో హైఅలర్ట్.. ఒకే దెబ్బకు…

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×