OTT Movie : టైమ్ ట్రావెల్ అనేది నెవర్ ఎండింగ్ టాపిక్. దీని గురించి ఎలాంటి డిస్కషన్ వచ్చినా చెవులు రిక్కించి మరీ వింటాము. మరి అదే సినిమా వస్తే ఊరుకుంటామా? చూసేదాకా వదిలి పెట్టము. ఇక ఓటీటీలో ఇంట్రెస్టింగ్ గా ఉండే జానర్ లలో సైకో కిల్లర్ సినిమాలు కూడా ఉంటాయి. ఈ రెండూ జానర్లలో సినిమాలు ఇప్పటిదాకా సెపరేట్ గా చూసి ఉంటారు. కానీ ఇప్పడు మనం చెప్పుకోబోయే సినిమాలో అటు టైమ్ ట్రావెల్, ఇటు సైకో కిల్లర్ రెండు జానర్లను కలిపి కొట్టాడు డైరెక్టర్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
స్టోరీలోకి వెళ్తే…
సినిమా 2024లో మిన్నెసోటాలోని స్వీట్లీ అనే చిన్న పట్టణంలో ప్రారంభమవుతుంది. లూసీ ఫీల్డ్ (మాడిసన్ బెయిలీ) ఒక హైస్కూల్ సీనియర్, ఆవిష్కర్త. 20 ఏళ్ల క్రితం ఆమె అక్క సమ్మర్ ఫీల్డ్ (ఆంటోనియా జెంట్రీ) హత్య జరుగుతుంది. సమ్మర్, తన ముగ్గురు స్నేహితులతో (ఎమ్మీ, బ్రియాన్, వాల్) కలిసి 2003లో “స్వీట్లీ స్లాషర్” అనే సీరియల్ కిల్లర్ చేతిలో హత్యకు గురవుతుంది. ఈ ట్రాజెడీ నుంచి లూసీ, ఆమె తల్లిదండ్రులు కోలుకోలేకపోతారు.
ఒక రోజు సమ్మర్ హత్య జరిగిన బార్న్ దగ్గర లూసీ ఒక వింత ఫ్లాష్ లైట్‌ను గమనిస్తుంది. అక్కడ ఆమె ఒక టైమ్ మిషన్‌ను చూస్తుంది. అనుకోకుండా 2003లోకి సమ్మర్ హత్యకు రెండు రోజుల ముందుకు ప్రయాణిస్తుంది. స్వీట్లీ పట్టణం 2003లో అద్భుతంగా ఉంటుంది. అది లూసీకి షాకింగ్ గా ఉంటుంది. లూసీ తన అక్క సమ్మర్‌ను, ఆమె స్నేహితులను స్వీట్లీ స్లాషర్ అనే సీరియల్ కిల్లర్ నుండి రక్షించాలని నిర్ణయిస్తుంది.
ఆమె స్కూల్‌లో తన సైన్స్ టీచర్ మిస్టర్ ఫ్లెమింగ్‌ను కలుస్తుంది. కానీ అతను 2003లో ఆమెను గుర్తు పట్టడు. అక్కడ ఆమె క్విన్ (గ్రిఫిన్ గ్లక్) అనే నెర్డీ స్టూడెంట్‌ను కలుస్తుంది. అతను ఫిజిక్స్‌లో సూపర్ ట్యాలెంటెడ్. లూసీ తాను భవిష్యత్తు నుండి వచ్చానని, టైమ్ మిషన్‌ను రిపేర్ చేయడానికి అతని సహాయం కావాలని క్విన్ ను అడుగుతుంది.
ఇక ఈ నేపథ్యంలోనే లూసీ సమ్మర్‌ను కలిసి, ఆమె జీవితంలోని కొన్ని రహస్యాలను తెలుసుకుంటుంది. సమ్మర్ బెస్ట్ ఫ్రెండ్, ఆమె బ్రేకప్ చేసుకున్న బాయ్‌ఫ్రెండ్ ఇథన్‌తో సహా. లూసీ తాను చేసే పనులు భవిష్యత్తును మార్చవచ్చని, తన ఉనికిని కూడా ప్రమాదంలో పడేస్తాయని తెలుసుకుంటుంది, ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు సమ్మర్ మరణం తర్వాతే ఆమెను కన్నారు. అయినప్పటికీ ఆమె సమ్మర్‌తో బంధం పెంచుకుంటుంది. ఆమెను రక్షించడానికి ఏదో ఒకటి చేయాలని నిర్ణయిస్తుంది.
స్వీట్లీ స్లాషర్ మరోవైపు హత్యలు చేస్తూనే ఉంటాడు. లూసీ, సమ్మర్, క్విన్ కలిసి కిల్లర్‌ను ఆపడానికి ప్రయత్నిస్తారు. కిల్లర్ గతం, అతని ఉద్దేశం గురించి తెలుసుకున్నాక లూసీ అక్కను రక్షించడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మరి లూసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అసలు కిల్లర్ గతం ఏంటి? ఎందుకు వరుసగా హత్యలు చేస్తున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
Read Also : వెంటాడి, వేటాడి చంపే పాయిజనస్ పొగ… వెనకడుగు వేస్తే నరకానికి డైరెక్ట్ టిక్కెట్
ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు “టైమ్ కట్” (Time Cut). ఇదొక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ స్లాషర్ హారర్ సినిమా. హన్నా మాక్‌ఫెర్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మాడిసన్ బెయిలీ, ఆంటోనియా జెంట్రీ, గ్రిఫిన్ గ్లక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదలైంది. తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ తెలుగు డబ్బింగ్ ఆప్షన్ లేదు.