BigTV English

Pawan Kalyan: జనసేనాని మాటలకు అర్థాలే వేరులే!?

Pawan Kalyan: జనసేనాని మాటలకు అర్థాలే వేరులే!?
PAWAN-KALYAN-CBN

Pawan Kalyan Latest Political News(AP Latest Updates): “వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. పొత్తులపై విపక్షాల్లో ఎవరైనా ఒప్పుకోకపోతే.. వారిని పొత్తులకు ఒప్పిస్తా”.. అంటే, పొత్తులకు ఏదో పార్టీ ఒప్పుకోవడం లేదనేగా అర్థం? అది బీజేపీనా, టీడీపీనా..?


బీజేపీ-జనసేన-టీడీపీ. పొత్తు అంతఈజీ మాత్రం కాదు. విడివిడిగా జనసేనతో పొత్తుకు ఎలాంటి ఆటంకం లేదుకానీ.. మూడు పార్టీల మైత్రికి మాత్రం పలు చిక్కుముడులు ఉన్నాయంటున్నారు. టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదనే టాక్ ఉంది. ఆ పార్టీ వైసీపీతో పరోక్ష స్నేహం చేస్తోందనే ప్రచారం ఉంది. పవన్ తమ వెంట తిరుగుతున్నాడు కాబట్టి.. జనసేనతో పొత్తు కంటిన్యూ చేస్తోంది. అలాగని.. పవన్‌ను చూసి టీడీపీతో జట్టుకట్టమంటే.. కుదురుతుందా?

ఇటీవల పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి రెండు మూడు రోజులుండి చర్చలకు గట్టి ప్రయత్నమే చేశారు. మొదట్లో పెద్దలంతా బిజీ అంటూ ముఖం చాటేశారని అంటున్నారు. ఏపీ బీజేపీ ఇంఛార్జ్ మురళీధరన్‌తోనే రెండు రోజులు భేటీ అయ్యారు. చివరాఖరికి ఎలాగోలా నడ్డా కాస్త టైమ్ ఇచ్చారు. పొత్తుల ఆవశ్యకతపై.. బలాబలాలను బేరీజు వేసి మరీ.. బీజేపీ జాతీయ అధ్యక్షునికి వివరించి వచ్చారు జనసేనాని. అయినా, ఆ మూడు పార్టీల పొత్తులపై ఇప్పటికీ క్లారిటీ రాలేదనే తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా గట్టిగా ఆరు నెలల సమయం కూడా లేకపోవడంతో.. పవన్‌లో ఆరాటం పెరిగింది.


ఇటు, టీడీపీ అధినేత చంద్రబాబును పదే పదే కలుస్తున్నారు జనసేనాని. పొత్తులు, సీట్లపై చర్చిస్తున్నారు. అసలే చంద్రబాబు.. అంత ఈజీగా అడిగినన్ని సీట్లు ఇచ్చేస్తారా? పవన్ కల్యాణ్ ఎంత తగ్గినా.. గౌరవ ప్రధమైన సంఖ్యలో సీట్ల పంపకాలు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. తమ బలం 7 శాతం నుంచి 30 శాతానికి పెరిగిందని.. ఆ లెక్క ప్రకారం తమకు స్థానాలు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఫలితాలతో గెలుపుపై ధీమాగా ఉన్న చంద్రబాబు.. పవన్ అడుగుతున్నన్ని సీట్లు ఇచ్చేందుకు బాగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

మూడు పార్టీల పొత్తు తమకే కలిసొస్తుందనే అభిప్రాయం చంద్రబాబులో బలంగా ఉంది. కానీ, సీట్ల దగ్గరే సమస్యంతా. జనసేనాని ఓ నెంబర్ కంటే తగ్గేదేలే అంటున్నారు. ఈయనేమో మరో నెంబర్ చెబుతున్నారు. అలాగాని ఎవరికి వారే పోటీ చేద్దామా? అంటే గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అయితే ఎట్టా అనే టెన్షన్ ఓవైపు. ఇలా కలవలేక.. విడలేక.. మధ్యలో పాపం పవన్ కల్యాణ్ తెగ ఇదైపోతున్నారు. ఆయన మాటల్లో ఆ విషయం స్పష్టమవుతోంది. వాళ్ల పొత్తు కుదిరేది లేదూ పాడూ లేదని అటు వైసీపీ కూల్‌గా ఉంది. ఒకవేళ కుదిరితే.. అనే భయం కూడా అధికార పార్టీలో లేకపోలేదు. ఆ బెదరు వైసీపీ నేతల మాటల్లో సుస్పష్టం.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×