BigTV English

Tirumala Laddu: సెటైరికల్ ట్వీట్ తో డిప్యూటీ సీఎం పవన్ కి షాక్.. రిప్లై కూడా అదిరింది

Tirumala Laddu: సెటైరికల్ ట్వీట్ తో డిప్యూటీ సీఎం పవన్ కి షాక్.. రిప్లై కూడా అదిరింది

pawan tweet on tirumala laddu: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు పవిత్రతపై వివాదం రగులుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లడ్డు పవిత్రతను కాపాడడంలో తాము అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంకా లడ్డు వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో.. టీటీడీ సైతం పకడ్బందీగా లడ్డులో వినియోగించే నెయ్యి విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నాయి. కాగా కొందరు సోషల్ మీడియా వేదికగా.. టీటీడీ , ఏపీ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ.. సెటైరికల్ విమర్శలు గుప్పిస్తున్నారు.


తిరుమల లడ్డును తయారు చేసేందుకు నెయ్యి ప్రధాన భూమిక పోషిస్తుంది. రుచికరమైన నెయ్యి ఉంటే చాలు.. తిరుమల లడ్డు కూడా అంతే రుచి ఉంటుంది. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీకై వినియోగించే నెయ్యిలో అపవిత్రం జరిగిందంటూ.. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ సమయంలోనే ఒక భిన్నమైన వాదన గట్టిగా వినిపించింది. లడ్డు తయారీకి ముందు నెయ్యిని పరిక్షించే పరికరాలు టీటీడీ వద్ద లేవా అన్నది కొందరు భక్తుల వాదన. ఆ వాదనకు తగినట్లుగానే.. టీటీడీ ఈవో శ్యామలరావు స్పందిస్తూ.. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిని తప్పక పరీక్షించడం జరుగుతుందని, కానీ ప్రవేట్ ల్యాబ్ లలో పరిక్షించి ఉపయోగించడం జరుగుతుందని ప్రకటించారు.

కోట్ల రూపాయల ఆదాయం వచ్చే టీటీడీ వద్ద.. నెయ్యిని పరీక్షించే వ్యవస్థ లేదనడం ఎంత వరకు సమంజసం అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. టీటీడీ స్వయంగా నెయ్యిని పరీక్షిస్తే అందులో ఎటువంటి తప్పిదాలు జరగవన్నది భక్తుల అభిప్రాయం. ఇప్పుడు ఇదే విషయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. పవన్ సైతం ఈ విషయంపై దృష్టి సారించి, త్వరలోనే శాశ్వత పరిష్కారం కనుగొంటామని స్పందించారు. ఇంతకు పవన్ ను సోషల్ మీడియా ద్వార ప్రశ్నించింది ఎవరో కాదు.. ప్రముఖ శాస్త్రవేత్త, రచయిత ఆనంద్ రంగనాధన్.


 Also Read: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?

శాస్త్రవేత్త ఆనంద్ రంగనాధన్ ఎక్స్ వేదికగా.. లడ్డును తయారీ చేసే ముందు నెయ్యిని పరిక్షించాలని, తయారీ చేశాక పరీక్షలు ఎందుకు అంటూ సెటైరికల్ గా పవన్ కు ట్యాగ్ చేశారు. అలాగే టీటీడీకి భక్తుల ద్వారా రూ.110 కోట్ల ఆదాయం సమకూరుతుందని, నెయ్యిని పరిక్షించే వ్యవస్థ కోసం రూ.1.65 కోట్లు ఖర్చవుతుందని సూచించారు. ఇప్పటికైనా తగిన యంత్రాలను టీటీడీ కొనుగోలు చేసి నెయ్యి నాణ్యతా పరీక్షలు స్వయంగా నిర్వహించాలని సూచించారు.

దీనిపై పవన్ స్పందిస్తూ.. తాము డబ్బు గురించి ఆలోచించడం లేదని, తమకు తిరుమల పవిత్రత కాపాడడమే తమ లక్ష్యమన్నారు. నెయ్యి నాణ్యతా ప్రమాణాలు టెస్టింగ్ చేసేందుకు కావాల్సిన వ్యవస్థ ఏర్పాటుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ రిప్లై ఇచ్చారు. మరి టీటీడీ త్వరగా నెయ్యి టెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న వాదనకు ఊతమిచ్చేలా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Related News

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Perni nani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్నపేర్ని నాని

Ysrcp Assembly: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో అయినా సంప్రదాయాలు పాటించరా?

AU Student Death: ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Big Stories

×