E-Paper
Advertisement

Pawan Kalyan Ippatam Visit: నాన్న నువ్వు 10 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి.. పవన్ కళ్యాణ్‌తో ఇండ్ల నాగేశ్వరమ్మ

Pawan Kalyan Ippatam Visit: నాన్న నువ్వు 10 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి.. పవన్ కళ్యాణ్‌తో ఇండ్ల నాగేశ్వరమ్మ
Advertisement

Pawan Kalyan Ippatam Visit: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాజకీయ నాయకుడిగా.. మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఆయన పర్యటించారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో పవన్‌ కల్యాణ్‌ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరింది. ఆమెకు ఇచ్చిన మాట మేరకు పవన్‌ కల్యాణ్‌ ఇప్పటం వచ్చారు.

ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు గ్రామస్థులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలితో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

Advertisement

పవన్‌ను  చూసిన వెంటనే నాగేశ్వరమ్మ భావోద్వేగానికి లోనై, నాన్నా.. నువ్వు 10 సార్లు సీఎం కావాలి, అది నేను చూడాలి అంటూ ఆశీర్వదించారు. దీనికి ప్రతిస్పందనగా పవన్ కళ్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

ఇండ్ల నాగేశ్వరమ్మతో మాట్లాడిన సందర్భంగా.. పవన్ కళ్యాణ్ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. నాగేశ్వరమ్మకు రూ.50 వేల సాయం, ఆమె మనవడికి రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించి అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత తన కోసం పవన్ కళ్యాణ్ రావడం చాలా సంతోషంగా ఉందని నాగేశ్వరమ్మ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. “వన్ కళ్యాణ్ నా బంగారం.. నాకు దేవుడు. ఆయన సీఎం కావాలనేది నా కోరిక అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కారణంతోనే.. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలు జరిగాయన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. ఆ కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గ్రామానికి వచ్చి బాధితులకు ధైర్యం చెప్పడం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మళ్లీ రావడం ఆయన రాజకీయ శైలిని స్పష్టంగా చూపిస్తోంది. ప్రజల సమస్యలను ఎన్నికల వరకే పరిమితం చేయకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గుర్తుంచుకోవడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: వైఎస్ జగన్‌కు అనారోగ్యం.. నేటి కార్యక్రమాలు రద్దు

ఇప్పటం పర్యటన పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా కీలక మలుపుగా మారింది. అధికారంలోకి వచ్చాక ప్రజలను మరిచిపోని నాయకుడిగా ఆయన చేసిన ఈ ప్రయాణం, రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రస్థానానికి మరింత బలాన్నిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×