Indian Woman Murdered: కెనడాలో దారుణం జరిగింది. భారతి యువతి హత్యకు గురైంది. దీని వెనుక ఓ వ్యక్తిని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి కోసం అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అక్కడి పోలీసులు. ఇంతకీ హత్యకు గల కారణాలేంటి? దీనివెనుక అసలేం జరిగింది? అనే దానిపైలోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కెనడాలో దారుణం.. భారత యువతి హత్య
కెనడా రాజధాని టొరంటోలో 30 ఏళ్ల భారతీమ మహిళ హిమాన్షి ఖురానా హత్యకు గురైంది. భాగస్వామి ఈ హత్యకు పాల్పడినట్టు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి పేరు అబ్దుల్ గఫూరి, 32 ఏళ్ల వయస్సు ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటన తర్వాత అతడు కనిపించకపోవడంతో అక్కడి పోలీసులు ఫోకస్ చేశారు.
అతడ్ని అరెస్టు చేయడానికి అధికారులు దేశవ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. డిసెంబర్ 19 అనగా శుక్రవారం రాత్రి నుంచి హిమాన్షి కనిపించలేదంటూ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు, రంగంలోకి దిగారు.
సహచరుడే నిందితుడు?, అధికారుల దర్యాప్తు
శనివారం వేకువ జామున స్ట్రాచన్ అవెన్యూ పరిసరాల్లోని ఓ ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆ ప్రాంతాన్ని గమనించిన పోలీసులు, ముమ్మాటికీ హత్యగా గుర్తించారు. దీన్ని ఇంటిమేట్ పార్ట్‌నర్ వయోలెన్స్ (సన్నిహితుల మధ్య జరిగిన హింస)గా భావిస్తున్నారు. బాధితురాలు- నిందితుడు ఒకరికొకరు తెలిసిన వారని అధికారులు భావిస్తున్నారు. వీరికి సంబంధించి చిత్రాలను విడుదల చేశారు.
నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు అయ్యింది. నేరం నిరూపణ అయితే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఏడాది ఈ నగరంలో ఇది 40వ హత్యగా పోలీసులు చెబుతున్నారు. హిమాన్షి ఖురానా హత్యపై టొరంటోలోని భారత ఎంబసీ కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ALSO READ: భార్యని నడిరోడ్డుపై కాల్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కారణం అదేనా?
భారతి మహిళ హిమాన్షి హత్య తీవ్రంగా కలచివేసిందని రాసుకొచ్చింది. ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ కేసుపై స్థానిక అధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.
We are deeply saddened and shocked by the murder of Ms. Himanshi Khurana, a young Indian national, in Toronto. We extend our deepest condolences to her bereaved family during this moment of profound grief. The Consulate has been in close touch with the matter over the past few…
— IndiainToronto (@IndiainToronto) December 23, 2025