వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఆ పార్టీ నేతల్లో కొంతమంది తీరు తీవ్ర వివాదాస్పదంగా ఉంది. వారి వ్యాఖ్యలు పార్టీకి మేలు చేయకపోగా.. తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని అంటున్నారు. ఇటీవల కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడింది. ఆయన ఇల్లు ధ్వంసమైనా కూడా ఆయనపై ఎవరూ సింపతీ చూపించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ డ్యామేజింగ్ గా మాట్లాడారు మాజీ మంత్రి పేర్ని నాని. అధికారంలోకి వచ్చాక కరిచేయండంటూ.. వైసీపీ కార్యకర్తలకు పేర్ని నాని ఒక వయలెంట్ సలహా ఇచ్చారు.
జగన్ సక్సెస్ ఫార్ములా.. అదే, నరుకుడి ఫార్ములా గురించి కార్యకర్తలకు చెప్తున్న పేర్ని నాని… గతంలో బాబాయ్ ని చీకట్లో కన్ను కొట్టి వేసేసి, తరువాత వెళ్లి ఏమి తెలియనట్టు ఎలా పరామర్శించాడో, అలాగే చేయాలని ట్రైనింగ్..
"రప్పా రప్పా నరికేస్తాం అని అరవటం కాదు.. చీకట్లో మొత్తం అయిపోవాలి..… pic.twitter.com/HRAWM1UYGP
— Telugu Desam Party (@JaiTDP) July 12, 2025
ఈరోజు సబ్జెక్ట్ అంతా పేర్ని నానీ మీదే నడిచింది. నానీ మాట్లాడిన ప్రతి మాటా వైసీపీకి డ్యామేజీ చేసేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు. రప్పా రప్పా అంటూ మాట్లాడటం కాదని, చీకట్లో కన్నుకొట్టినంత ఈజీగా మనం చేసే పనులు ఉండాలన్నారు నానీ. అరిచే కుక్క కరవదని, కరిచే కుక్క అరవదంటూ ఓ లాజిక్ కూడా చెప్పారాయన. వైసీపీ శ్రేణులు అరవకుండా కరిచేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక అదను చూసి కరిచేయాలని, ఆ తర్వాత తీరిగ్గా బాధితుల వద్దకు వెళ్లి సింపతీ చూపించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు బయటకు రావేమోనని అనుకున్నారు. కానీ ఆ మాటలు బయటకొచ్చాయి. రెండురోజుల ఆలస్యంగా అవి వైరల్ అయ్యాయి. దీంతో టీడీపీ కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడుతున్నారంటూ పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో నానీ అలర్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు.
RAPA RAPA డైలాగులు చెప్పకండి అని అన్నాను.
నేను ఎర్రబుక్కు, కట్ డ్రాయర్ తో పరిగెత్తిస్తాను అని నేను ఏమీ అనలేదు.
– పేర్ని నాని pic.twitter.com/APoThrB9J4
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) July 12, 2025
నాలుగు రోజుల క్రితం తాను పార్టీ మీటింగ్ లో చెప్పిన మాటల్ని ఇప్పుడు కావాలని వైరల్ చేశారని అంటున్నారు పేర్ని నాని. తానేం తప్పుగా మాట్లాడలేదని కవరింగ్ గేమ్ మొదలు పెట్టారు. తానెవర్నీ కొడతానని అనలేదని, డ్రాయర్లపై నిలబెడతానని కూడా సవాళ్లు విసరలేదని అన్నారు. కానీ ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో అప్పటికే వైరల్ అయ్యాయి. ఎవరికైనా హాని చేసే ముందు ఆ విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదని, హాని చేసే వరకు సైలెంట్ గా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు నానీ. తీరా ఆ వ్యాఖ్యలు వైరల్ కావడం, నెగెటివ్ కామెంట్లు రావడంతో ఇప్పుడు కవర్ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు.
ఇటీవల వైసీపీలో పేర్ని నాని కాస్త అగ్రెసివ్ గా ఉంటున్నారు. వల్లభనేని వంశీ విడుదల తర్వాత ఆయన వరుసగా మీడియా ముందుకొచ్చారు. పార్టీ మీటింగుల్లోనూ హడావిడి చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పార్టీ కూడా ఏమీ చేయలేకపోయింది. సహజంగా సాక్షి మీడియా కవరింగ్ స్టోరీస్ ఇవ్వాలి కానీ ఈ సందర్భంలో అది కూడా కూదర్లేదు. దీంతో ఆయనే మరోసారి మీడియా ముందుకొచ్చి.. తాను తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, వైసీపీకి పేర్ని నాని వ్యాఖ్యలు బాగా డ్యామేజీ చేశాయని అంటున్నారు నెటిజన్లు.