OTT Movie : ఓటీటీలలో సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్స్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. అందుకే ఇలాంటి జానర్లో వచ్చే సినిమాల కోసం అన్ని ఓటీటీలను జల్లెడ పడుతున్నారు. ఒకవేళ మీరు కూడా అలాంటి సినిమాల ప్రేమికులే అయితే ఈ మూవీ మీకు పర్ఫెక్ట్. మరి ఈ మూవీ కథ ఏంటి? ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ మూవీ పేరు “The Strangers: Chapter 1”. 2024లో విడుదలైన అమెరికన్ హారర్ చిత్రం ఇది. రెన్నీ హార్లిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008లో వచ్చిన “The Strangers” చిత్రానికి రీఇమాజినేషన్, రీబూట్ ట్రైలాజీలో మొదటి భాగం. ఈ చిత్రంలో మ్యాడలైన్ పెట్ష్ (మాయా), ఫ్రాయ్ గుటిరెజ్ (ర్యాన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ముగ్గురు ముసుగు ధరించిన సైకోపాత్ లు ఓ జంటను టార్గెట్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. 8.5 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 47.4 మిలియన్ డాలర్లను వసూళ్లు సాధించింది.
కథలోకి వెళ్తే…
చిత్రం ఒక హింసాత్మక దృశ్యంతో ప్రారంభమవుతుంది. ఇందులో జెఫ్ మోరెల్ (ర్యాన్ బ్రౌన్) అడవిలో భయంతో పరుగెత్తుతూ, ముగ్గురు ముసుగు ధరించిన స్ట్రేంజర్స్… స్కేర్‌క్రో (మాటస్ లాజ్కాక్), పిన్-అప్ గర్ల్ (లెటిజియా ఫబ్బ్రి), డాల్‌ఫేస్ (ఒలివియా క్రూట్జోవా) నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. చివరికి వాళ్ళు కత్తితో దాడి చేసి ఆమెను కిరాతకంగా చంపేస్తారు. నెక్స్ట్ కథ మాయా (మ్యాడలైన్ పెట్ష్), ర్యాన్ (ఫ్రాయ్ గుటిరెజ్) అనే జంటపైకి మారుతుంది.
ఈ జంట తమ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లో కొత్త జీవితం ప్రారంభించడానికి రోడ్ ట్రిప్‌లో ఉంటారు. ఒరెగాన్‌లోని వీనస్ అనే చిన్న పట్టణంలో వారి కారు పాడవడంతో, ఒక రాత్రి అక్కడే గడపవలసి వస్తుంది. అయితే ఆ పట్టణంలోని స్థానికులు వింతగా ప్రవర్తిస్తారు. ఒక డైనర్‌లో వారు జెఫ్ మిస్సింగ్ పోస్టర్‌ను చూస్తారు. మెకానిక్ రూడీ (బెన్ కార్ట్‌రైట్) వారి కారును మరుసటి రోజు వరకు రిపేర్ చేయలేమని చెప్తాడు. యిట్రెస్ షెల్లీ (ఎమా హోర్వాత్) వారిని ఒక సీక్లూడెడ్ క్యాబిన్‌కు తీసుకెళ్తుంది. క్యాబిన్‌లో మాయా, ర్యాన్ తమ సంబంధంలోని సమస్యలను (ర్యాన్ ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ, మాయా కొత్త ఉద్యోగం కోసం సిద్ధమవుతూ) చర్చిస్తారు.
ఆరోజు రాత్రి ఒక వింత మహిళ “తమరా ఇక్కడ ఉందా?” అని అడుగుతూ తలుపు తడుతుంది. తర్వాత కాసేపటికే ముసుగు ధరించిన స్ట్రేంజర్స్ క్యాబిన్‌లోకి చొరబడతారు. వారిని భయపెట్టడం, వేటాడటం ప్రారంభిస్తారు. మాయా ఒక చిత్రం వెనుక ఒక స్ట్రేంజర్‌ను చూస్తుంది. కానీ ర్యాన్ ఆమె భ్రమ పడుతుంది అనుకుంటాడు. కానీ ఆ స్ట్రేంజర్స్ వారిని గొడ్డలి, కత్తులతో టార్గెట్ చేస్తారు. దీంతో మాయా, ర్యాన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ఇంట్లో ఉన్న ఆయుధాలు సేకరిస్తారు. క్యాబిన్ ఫ్లోర్‌స్పేస్‌లో దాక్కుంటారు. అక్కడ మాయా చేతిలో ఒక మేకు గుచ్చుకుంటుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన యజమానిని పొరపాటున ఆ స్ట్రేంజర్స్ అనుకుని చంపేస్తారు హీరో హీరోయిన్. చివరకు ఎలాగోలా ఆ ఇంట్లో నుంచి బయటపడి, ఆ యజమాని కారులో నుంచి ఎస్కేప్ అవుదామని అనుకుంటారు. కానీ ఆ స్ట్రేంజర్స్ కారణంగా కారు కూడా నాశనం అవుతుంది. మరి చివరకు వాళ్ళ నుంచి హీరో హీరోయిన్ తప్పించుకోగలిగారా? ఆ స్ట్రేంజర్స్ ఎవరు? ఎందుకు వీళ్ళని ఇలా వేటాడుతున్నారు? అనేది తెరపై చూడాల్సిందే. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా ఉండే ఈ మూవీతో సీట్ ఎడ్జ్ థ్రిల్ ఖాయం.