BigTV English

Stylish Star Plexi Viral: వైసీపీ వాడకం వేరయా.. స్టైలిష్ స్టార్ ని ఇలా వాడేస్తున్నారేంటి.. ప్లెక్సీ వైరల్

Stylish Star Plexi Viral: వైసీపీ వాడకం వేరయా.. స్టైలిష్ స్టార్ ని ఇలా వాడేస్తున్నారేంటి.. ప్లెక్సీ వైరల్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ను వైసీపీ వాడేస్తోందా అంటే అవుననే అంటున్నారు బన్నీ అభిమానులు. ఎన్నికల సమయంలో ఫ్రెండ్ కోసం వైసీపీ తరపున హీరో అల్లుఅర్జున్ ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు ఫ్రెండ్ కోసం వెళ్ళిన అల్లుఅర్జున్ పై నాడు ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల సమయంలో సంచలనంగా మారింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కి మద్దతుగా అల్లుఅర్జున్ ప్రచారం చేయగా.. మెగా కుటుంబంలో కొంత విభేదాలు వచ్చాయని నాడు సోషల్ మీడియా కోడై కూసింది. ఆ తరుణంలో డిప్యూటీ సిఎం పవన్ అభిమానులు ఓ రేంజ్ లో అల్లుఅర్జున్ పై విమర్శల జోరు సాగించారు. ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే.. అల్లుఅర్జున్ కి, అతని ఫ్రెండ్ రవికి ఊహించని షాక్ తగిలింది. తాను ప్రచారం చేసినా ఫ్రెండ్ ఓటమి చెందడంపై కొంత నిరుత్సాహానికి అల్లుఅర్జున్ గురయ్యారనే చెప్పవచ్చు.


తమ ఫ్యామిలీ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా.. ప్రచారం చేయకపోగా.. వైసీపీ అభ్యర్థికి అల్లుఅర్జున్ మద్దతు పలకడం ఓరకంగా మెగా ఫ్యామిలీలో దుమారం రేగిందని చెప్పవచ్చు. ఇలా ఫ్రెండ్ కోసం వెళ్ళిన తనకు వైసీపీ ముద్ర పడడంపై స్టైలిష్ స్టార్ కొంత మిన్నకుండి పోయారు. ఇంతకు ఇప్పుడు ఈ చర్చ దేనికీ అనుకుంటున్నారా.. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏదైతే నాడు అల్లుఅర్జున్ పై ప్రచారం చేశారో ఇప్పుడు అదే వాస్తవమయ్యేలా ఓ ప్లెక్సీ ఆంధ్రలో వైరల్ గా మారింది.


విజయనగరం జిల్లాలో అంతా ఈ ప్లెక్సీ పైనే అంతా రచ్చ సాగుతోందని చెప్పవచ్చు. ఏదో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన హీరో అల్లుఅర్జున్ ఫోటోను.. ఈ జిల్లా వైసీపీ నేతలు యమ వాడేశారని అల్లు అభిమానులు అంటున్నారు . జిల్లాలోని డెంకాడ మండలం పినతాడివాడ గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ జాతరలో పాల్గొంటారు. ఈ జాతరకు భక్తులను ఆహ్వానిస్తూ.. అక్కడి వైసీపీ నేతలు భారీ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలో మాజీ సిఎం జగన్ చిత్రంతో పాటు, స్థానిక వైసీపీ నేతల చిత్రాలు, అలాగే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ చిత్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. పుష్ప-2 మూవీలోని స్టిల్ తో ప్లెక్సీ ఏర్పాటు చేయగా.. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

వాడకంలో వైసీపీ నేతల తరువాతే ఎవరైనా.. ప్లెక్సీపై అల్లుఅర్జున్ చిత్రం అవసరమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఏదో మిత్రుడి కోసం వైసీపీ వైపుకు ఒక్క అడుగు వేసిన అల్లుఅర్జున్ కి నాటి అడుగులు.. ఇంకా ఈ ప్లెక్సీ రూపంలో వెంటాడుతున్నాయన్నమాట. కాగా.. ఏదో పుష్ప-2 స్టిల్ నచ్చి తాము ప్లెక్సీ ఏర్పాటు చేస్తే, ఇలా వైరల్ అవుతుందని గ్రహించలేక పోయారట అక్కడి నేతలు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×