BigTV English
Advertisement

Devara Movie : నచ్చితే చూస్తారు.. లేదంటే లేదు.. కొరటాల గారు ఏదో తేడా కొడుతుందే..?

Devara Movie : నచ్చితే చూస్తారు.. లేదంటే లేదు.. కొరటాల గారు ఏదో తేడా కొడుతుందే..?

Devara Movie : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమాతో భారీ ప్లాఫ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నేళ్లకు మళ్లీ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రతిష్టాత్మక చిత్రంగా వస్తున్నా దేవర పై కొరటాల ఆశలు పెట్టుకున్నారు.. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఇక కొరటాల సినిమా హిట్ అవుతుందనే ధీమాతో ఉన్నాడు.. దేవర ప్రమోషన్స్ కోసం కొరటాల అనేక మీడియా ఛానెల్స్ తో ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.


డైరెక్టర్ కొరటాలా చాలా కాలం గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో రూపొందించబడిన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఒకప్పుడు కొరటాల శివ సినిమా ఆడియెన్స్‌లో ఎలాంటి అనుమానాలుండేవి కాదు. మిర్చి, శ్రీమంతుడు, జనత గ్యారేజ్, భరత్ అనే నేను అంటూ ఇలా అన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాడు. కానీ కొరటాల కెరీర్‌కు ఆచార్య ఓ మచ్చలా మారిపోయింది. ఇక ఆచార్య ఫ్లాపు నుంచి బయట పడేందుకు కొరటాల శివ దేవరతో రాబోతోన్నాడు. రేపు ఈ సినిమా జాతకం ఏంటో బయట పడనుంది. తన సినిమాకు ప్రమోషన్ ఇచ్చేందుకు కొరటాల మీడియాతో కంటిన్యూ గా ముచ్చట్లు పెడుతున్నాడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఫ్యాన్స్ షాక్ అయ్యే కామెంట్స్ చేసి ట్రోల్స్ వేయించుకుంటున్నాడు.

మెగాస్టార్ చిరంజీవితో తనకు మంచి బంధం ఉందని, ఆచార్య ఫ్లాప్ తరువాత ఆయనే మొదటగా మెసెజ్ చేశారని అన్నాడు. దేవరతో మళ్లీ స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతావని భరోసానిచ్చాడట. ఇక ఎన్టీఆర్ దేవర రెండో పార్ట్ కాస్త ఆలస్యం అయితే మాత్రం మధ్యలో వేరే మూవీ చేసి వస్తానని అన్నాడు. అల్లు అర్జున్ కొరటాలతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కొరటాల జనరల్ ఆడియెన్స్ జడ్జ్మెంట్ గురించి మాట్లాడాడు. ఆడియెన్స్ శంకరాభరణం సినిమాను హిట్ చేశారు. యానిమల్ సినిమాను హిట్ చేశారు.. ఆడియెన్స్‌కి నచ్చితే సినిమా చూస్తారు లేదంటే లేదు.. చివరకు ఏది ఏమైనా ఆడియెన్స్ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అని ఫైనల్ గా చెప్పాడు. ఓటీటీలు రావడం వల్ల ఆడియెన్స్ టేస్ట్‌లో మార్పు వచ్చిందని అనుకోవడం లేదని అన్నాడు..


థియేటర్లలో హిట్ అయినా లేకున్నా కూడా రెండు వారాల్లో సినిమాలు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. ఆ మార్పు మాత్రమే వచ్చిందని అన్నాడు. ఇక దేవర సినిమాను ఇంతవరకు బయటి వ్యక్తికి చూపించలేదని, ఫ్యామిలీ మెంబర్లు మాత్రమే చూశామని అన్నాను. తాను, ఎన్టీఆర్, సినిమా టీం మాత్రమే దేవరను చూశామని అన్నాడు.. మా వరకు సినిమా బాగా వచ్చిందని అనుకుంటున్నాం.. ఇక ఆడియన్స్ ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలని అన్నారు.. ప్రస్తుతం కొరటాల వ్యాఖ్యల పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×