BigTV English

PM Modi – Pawan Kalyan: వేదికపై అందరి ముందు.. పవన్‌ను అలా ప్రశ్నించిన మోదీ, జనసేనాని ఏం చెప్పారంటే?

PM Modi – Pawan Kalyan: వేదికపై అందరి ముందు.. పవన్‌ను అలా ప్రశ్నించిన మోదీ, జనసేనాని ఏం చెప్పారంటే?

PM Modi – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హిమాలయాలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారా? మున్ముందు పవన్ అక్కడే ఉండే ప్లాన్ చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వచ్చింది పవన్ నోట. ఇంతకు ఈ ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అసలు ఈ టాపిక్ లేవనెత్తింది ఎవరో కాదు.. సాక్షాత్తు పీఎం మోడీ.


ఢిల్లీ సీఎంగా రేఖాగుప్త ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పీఎం మోడీ ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్య స్థితిగతులు అన్ని అడిగి తెలుసుకున్న పీఎం మోడీ.. పవన్ కాషాయ వస్త్రధారణలో ఉండడంతో పలు ప్రశ్నలు సంధించినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ మీడియాతో చెప్పారు.

పవన్ కళ్యాణ్ కు భక్తిభావం ఎక్కువనే చెప్పవచ్చు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో పలు దీక్షలను సైతం పవన్ ఆచరించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ప్రచార వాహనమైన వారాహి వాహనాన్ని ప్రజల్లోకి తీసుకు వస్తున్న క్రమంలో, వారాహి దీక్షను సైతం ఆచరించారు. అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణ కోసం డిప్యూటీ సీఎం హోదాలో కూడా పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు దీక్షను ఆచరించి తన భక్తి భావాన్ని చాటుకున్నారు.


ఇటీవల అనారోగ్య పాలైన పవన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గల పలు ఆలయాలను సందర్శించారు. ఆ పర్యటనలో సైతం కాషాయా వస్త్రాలను ధరించి పవన్ ఆలయాలలో పూజలు నిర్వహించారు. అనంతరం ఏపీకి వచ్చిన పవన్.. నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లి కుంభమేళాలో పాల్గొన్నారు. అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.

సాధారణంగా పవన్ భక్తి కార్యక్రమాలలో చాలా సాదాసీదా దుస్తులతో కనిపిస్తారు. అలయాల సందర్శనకు వెళ్లిన సమయంలో కాషాయ వస్త్రాలను ధరించి తన భక్తిభావాన్ని చాటుకుంటారు. అంతేకాదు తన పిల్లలకు కూడా ఇదే రీతి సంప్రదాయాన్ని అలవాటు చేసేందుకు తనతో పాటు ఆలయాల సందర్శనకు పవన్ వారిని కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. తాజాగా పవన్ కుంభమేళా పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్లారు.

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారానికి కాషాయ వస్త్రధారణలోనే పవన్ పాల్గొన్నారు. పవన్ వస్త్రధారణను గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. హిమాలయాలకు వెళ్తున్నారా అంటూ ప్రశ్నించారు. అందుకు ఇంకా సమయం ఉందని తాను సమాధానం ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ మీడియాతో తెలిపారు. కేవలం ఎన్డీఏ బలమే కాదని, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశాన్ని బలోపేతం చేయడమే తమ ముందున్న లక్ష్యం అంటూ పవన్ అన్నారు.

Also Read: AP Schools: ఏపీలో ఒంటి పూట బడులు? ఆ తేదీ నుండేనా?

ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడంపై పవన్ స్పందిస్తూ.. 27 ఏళ్ల తర్వాత చారిత్రాత్మకమైన విజయాన్ని బీజేపీ అందుకుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తాకు పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తం మీద పవన్ కాషాయ వస్త్రధారణను గమనించి పీఎం మోడీ అడిగిన ప్రశ్నకు.. పవన్ హిమాలయాలకు వెళ్లేందుకు ఇంకా సమయం ఉందని సమాధానం ఇవ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×