Kubera Movie: మామూలుగా సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక విధంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. అలా సమస్యల వల్ల ప్రేక్షకుల ముందుకు రాకుండానే ఆగిపోయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టైటిల్ రివీల్ చేసినప్పటి నుండే కష్టాలు మొదలయ్యాయి. అయినా అవన్నీ పట్టించుకోకుండా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మూవీకి సంబంధించి ప్రత్యర్థులు మరొక బాంబ్ పేల్చారు. ‘కుబేర’ను ఎలాగైనా ఆపేయాలి అనే ఉద్దేశ్యంతో దీని గురించి ప్రేక్షకులు షాకయ్యే విషయాలు చెప్తామని, అందుకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఎవరు వాళ్లు.?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తున్న ‘కుబేర’ మూవీ టైటిల్ తమదే అంటూ కొందరు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారు. నరేందర్ అనే వ్యక్తి టైటిల్ విషయంపై ఫిలిమ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ కమ్ములపై కూడా కేసు నమోదయ్యింది. దీంతో మేకర్స్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా అదే టైటిల్‌ను కంటిన్యూ చేస్తూ దాదాపు సినిమా షూటింగ్‌ను చివరిదశ వరకు తీసుకొచ్చారు. ఇప్పటికీ ‘కుబేర’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేకపోయినా షూటింగ్ మాత్రం చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఇంతలోనే ఈ మూవీకి కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఈసారి ఆ ఇబ్బందులను వారు సీరియస్‌గా తీసుకోవాలని తెలుస్తోంది.
ప్రెస్ మీట్ ఫిక్స్
మామూలుగా శేఖర్ కమ్ముల ప్రతీ సినిమా టైటిల్‌కు ఒక స్టైల్ ఉంటుంది. కానీ ‘కుబేర’ (Kubera) టైటిల్ మాత్రం శేఖర్ కమ్ములది కాదని, అందుకే దాని స్టైల్‌ను మార్చారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆ టైటిల్ తనది కాదని తెలిసినా కూడా కావాలని అదే ఇంకా ఉపయోగిస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి ‘కుబేర’ మాది అంటూ ఒక ప్రకటన విడుదల చేసి, దీని గురించి పూర్తి వివరాలు బయటికి చెప్పడం కోసం ఫిబ్రవరి 22న సోమాజిగూడలో ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ పూర్తయితే కానీ.. అసలు ‘కుబేర’ను అడ్డుకుంటుంది ఎవరు, వారు చేస్తున్న ఆరోపణలు నిజమేనా అనే విషయంపై క్లారిటీ వస్తుంది.
Also Read: ఆర్జీవీతో కృష్ణవంశీకి విబేధాలకు కారణం ఇదేనా?
డిఫరెంట్ సినిమా
శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమాలంటే ఫీల్ గుడ్ ఉంటాయి. అందులో కాస్త సోషల్ మెసేజ్ ఉన్నా కూడా మూవీ చూస్తున్నంతసేపు అలా సాగిపోతుందే అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు రావడం సహజం. కానీ మొదటిసారి తన కంఫర్ట్ జోన్‌ను దాటి ‘కుబేర’ లాంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ ఏమో అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. ఇందులో ధనుష్‌తో పాటు సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ క్యారెక్టర్స్‌కు సంబంధించిన గ్లింప్స్‌లు విడుదలయ్యాయి. ఇప్పుడు ‘కుబేర’ విషయంలో జరిగినట్టుగానే ఇంతకు ముందు మహేశ్ బాబు హీరోగా నటించిన ‘ఖలేజా’ టైటిల్ విషయంలో కూడా జరిగింది.