BigTV English

Junk Food: ఇలాంటి ఫుడ్ తింటున్నారా ? ఇక మీ పని అయిపోయినట్లే !

Junk Food: ఇలాంటి ఫుడ్ తింటున్నారా ? ఇక మీ పని అయిపోయినట్లే !

Junk Food: నేటి బిజీ లైఫ్‌ కారణంగా చాలా మంది ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ చూపడం లేదు. సమయం లేకపోవడం వల్ల అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుని తినడమో లేదా బయట ఫుడ్ తినడం వంటివి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇదిలా ఉండే జంక్ ఫుడ్ తినే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇలాంటి పదార్థాలు తినడం వల్ల అవి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. మరి జంక్ ఫుడ్ తినడం ఎందుకు ప్రమాదకరం ? వీటిని స్లో పాయిజన్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


చక్కెర:
మీరు క్రమం తప్పకుండా చక్కెరతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే అది స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. మీరు చక్కెర లేదా చక్కెరతో తయారు చేసిన స్వీట్స్ తో పాటు ఇతర పదార్థాలు తినడం వల్ల అది ఊబకాయం, మైగ్రేన్, అలసట, ఉబ్బసం ; మధుమేహం వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఇలాంటివి తినడం వల్ల మీ వయస్సు కూడా వేగంగా పెరుగుతుంది. చక్కెర కలిపిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వైట్ ఫ్లోర్:
శుద్ధి చేసిన పిండిని తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా హానికరం. మనం వంటకాల్లో వాడుతున్న తెల్లటి పిండిలోని ఫైబర్ అంతా తొలగిపోతుంది. మీరు దీన్ని తినడం వల్ల మీకు జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇది మాత్రమే కాదు, దీనిలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్లు మీ రక్తాన్ని పలుచగా చేస్తాయి. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులకు కూడా ఇది కారణం అవుతుంది.


ఫాస్ట్, జంక్ ఫుడ్ :
సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే గనక మీరు వీలైనంత త్వరగా మానేయండి. ఎందుకంటే ఫిజ్జాలు , బర్గర్లు, వివిధ రకాల స్నాక్స్ లో మోనోసోడియం గ్లుటామేట్ ఉంటుంది. ఇది మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు కారణం జంక్ ఫుడ్ తినడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఆముదంలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో బట్ట తల రాదు

కూల్ డ్రింక్స్:
మీరు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా ? అవును కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం విషం కంటే తక్కువేమీ కాదు. చాలా మంది కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సమ్మర్ లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటిలో చక్కెరతో పాటు ఫాస్పోరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీ మెదడు దెబ్బతింటుంది. అంతే కాకుండా ఇది గుండె పోటుకు కారణమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×