Big Stories

PM Modi Road Show : ఏపీలో ప్రధాని పర్యటన.. నేడు విజయవాడలో రోడ్ షో

PM Modi Road Show in Vijayawada : ఇక ఐదు రోజులే సమయం. మూడు రోజుల్లో ప్రచార పర్వాలకు తెరపడనుంది. మైకులు మూగబోనున్నాయి. ఏపీలో ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రధాన పోటీ వైసీపీ – టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మధ్య జరగనుంది. పోటీ రసవత్తరంగా జరగనుందన్న విషయం తెలిసిందే. గెలుపు మాదంటే మాదంటూ.. అధికార, ప్రతిపక్షాలు పరస్పర విమర్శలు చేసుకుంటూ.. తమతమ మేనిఫెస్టోలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సాయశక్తులూ ఒడ్డుతున్నారు.

- Advertisement -

ప్రచారంలో భాగంగా నేడు ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో పర్యటించనున్నారు. సాయంత్రం విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ షో లో పాల్గొననున్నారు. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కూడా ఈ రోడ్ షో లో పాల్గొంటారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ..1.5 కిలోమీటర్ వరకూ పీవీపీ మాల్ నుంచి బెంజిసర్కిల్ వరకూ రోడ్ షో జరగనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం నుంచే ఆంక్షలు అమలు కానున్నాయి.

- Advertisement -

Also Read : రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ కుట్ర..నకిలీ వీడియోల తయారీలో బిజీ : పీఎం మోదీ

ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా పోలీసులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చర్యలు తీసుకుంటున్నారు. సింగ్ నగర్ లో జగన్ కు జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని.. అలాంటి జరగకుండా ఉండేందుకు భారీఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన సమయంలో కరెంట్ కోత ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. మొత్తం 5 వేల మంది పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బందర్ రోడ్డు వరకూ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే.. 6 ఐపీఎస్ అధికారులకు సెక్టార్ బాధ్యతలు అప్పగించారు.

సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేతాజీ వంతెన, వెటర్నరీ జంక్షన్ మీదుగా పీవీపీ మాల్ వద్దకు చేరుకుంటారు. రోడ్ షో బెంజిసర్కిల్ వద్ద ముగుస్తుంది. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News