Big Stories

Sonia Gandhi video message: సోనియా వీడియో సందేశం, అలాంటి వారిని దూరంగా పెట్టండి?

Sonia Gandhi video message: సార్వత్రిక ఎన్నికలకు మూడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కానీ,  కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రచారంలోకి దిగలేదు. దీనిపై రకరకాలుగా ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. కేవలం యువనేత రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు మాత్రమే దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా దేశ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.

- Advertisement -

అబద్దాలు ఆడేవారిని ఈ ఎన్నికల్లో దూరంగా పెట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ. అంతేకాదు విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ఎన్నికల్లో తిరస్కరించాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు. మూడోదశ ఎన్నికల నేపథ్యంలో ఆమె మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్, ముఖ్యంగా ఇండియా కూటమి కట్టుబడి ఉందన్నారు. నిరు ద్యోగం, మహిళలపై నేరాలు, దళితులపై వివక్ష వంటివి మునుపెన్నడు లేనంత స్థాయికి చేరుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

- Advertisement -

సమాజాన్ని ముక్కలు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనకెంతో వేదన కలిస్తున్నాయని మనసులోని మాట బయట పెట్టారు సోనియాగాంధీ. బలమైన మరింత ఐక్యత కోసం శాంతియుత, సామరస్య దేశాన్ని నిర్మించేందుకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. అందరికీ సమానమైన అవకాశాలు లభించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. దేశంలో నిరుద్యోగం విచ్చలవిడిగా  పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇవేకాకుండా మహిళలపై దాడులు రెట్టింపయ్యాయన్నారు.

ALSO READ: రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ కుట్ర..నకిలీ వీడియోల తయారీలో బిజీ : పీఎం మోదీ

ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అస్సలు కనిపించలేదు. మొన్నటిమొన్న కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీలో నామినేషన్ సందర్భంగా బయటకువచ్చారు. ఆ తర్వా ఆమె కనిపించలేదు. అనారోగ్య సమస్యల వల్ల ఆమె బయటకు రావడంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచార సభల్లో గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇచ్చేబదులు సూటిగా సుత్తిగా చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పారని ఆ పార్టీ నేతలంటున్నారు.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News