BigTV English

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు కొత్త సమస్య మొదలయ్యిందా? న్యాయస్థానం ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? యూరప్ టూర్ ఆయనకు కొత్త చిక్కు తెచ్చిందా? ఈసారైనా న్యాయస్థానం ముందు హాజరవుతారా? ఏదో సమస్య పేరుతో డుమ్మా కొడతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


అక్రమాస్తుల కేసులో జగన్‌కు న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. కేసుల విషయంలో న్యాయస్థానానికి హాజరుకాకుండా ఏదో విషయం చెప్పి తప్పించుకుంటూ వచ్చారు. గడిచిన ఆరేళ్లు ఇదే పని చేశారు. ఇంకోవైపు పుష్కరకాలం దాటినా జగన్ అక్రమాస్తుల కేసు అడుగు ముందుకు పడలేదంటూ పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు సీబీఐ న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది.

అక్రమాస్తుల కేసులో 2019-25 వరకు అంటే దాదాపు ఆరేళ్లుగా న్యాయస్థానం ముందు హాజరుకాలేదు మాజీ సీఎం జగన్. న్యాయస్థానం రావాలని ఆదేశించినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి న్యాయస్థానం ముందుకు వెళ్లడం నామోషిగా ఉంటుందని భావించి రకరకాల కారణాలు చెప్పి ఆయన తప్పించుకుంటున్నారు.


అధికారంలో ఉన్నప్పుడు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల హాజరు కాలేనని, వ్యక్తిగత మినహాయింపు కోర్టు నుంచి పొందారు. అప్పుడు న్యాయస్థానాలు సైలెంట్ అయ్యాయి. గతేడాది లండన్‌లో ఉన్న కూతురు పుట్టినరోజుకు జగన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ALSO READ: సీఎంకు నోటీసులు పంపిస్తారా.. సీఐ శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

పదవి పోయిన తర్వాత డిప్లమోటిక్ పాసుపోర్టు లేదు. దీంతో సాధారణ పాస్‌పోర్టుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానానికి పిటిషన్ పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించడంతో వెళ్లడం ఇష్టం లేక లండన్ ట్రిప్ వాయిదా వేసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే సమస్య జగన్‌ను వెంటాడుతోంది.

తన యూరప్ పర్యటనకు అనుమతించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ సీఎం జగన్. అక్టోబర్ 1 నుంచి 30 లోపు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, అక్టోబర్ నెలలో 15 రోజులు యూరప్ వెళ్లి రావాలని పేర్కొంది.

యూరప్ పర్యటన తర్వాత సీబీఐ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. నవంబర్ 1 నుంచి 14 లోపు వ్యక్తి గతంగా హాజరు కావాలని తేల్చి చెప్పింది. చాలా ఏళ్ల తర్వాత జగన్‌ను వ్యక్తిగతంగా విచారణకు రావాలని కోర్టు ఆదేశించడం ఇప్పుడు ఏపీ అంతగా చర్చ మొదలైంది.

ఈ క్రమంలో యూరప్ వెళ్లాలా? వద్దా అనే డైలామాలో జగన్ పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హాజరుకావాలని న్యాయస్థానం చెప్పడంతో డ్రాపయ్యారని, ఇప్పుడు మళ్లీ అలాంటి రూల్స్ పెట్టిందని అంటున్నారు. ఇంతకీ జగన్ యూరప్ వెళ్తున్నారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related News

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Big Stories

×