BigTV English

Sajjala Bhargav: చిక్కుల్లో సజ్జల, భార్గవ్‌రెడ్డి.. ఆచూకీ కోసం పోలీసుల వేట

Sajjala Bhargav: చిక్కుల్లో సజ్జల, భార్గవ్‌రెడ్డి.. ఆచూకీ కోసం పోలీసుల వేట

Sajjala Bhargav: వైసీపీలో కొందరు నేతలకు టెన్షన్ మొదలైందా? సోషల్ కాలకేయుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొందరు ఎస్కేప్ అయ్యారా? పోలీసుల అదుపులో ఉన్నవారు తండ్రీ-కొడుకు పేరు చెప్పారా? వారి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారా అవుననే సమాధానం వస్తోంది.


వైసీపీ అని చెప్పగానే.. ముందుగా ఆ పార్టీ సోషల్ మీడియా పేరు బలంగా వినిపించేది. వేలాది మంది యువతీ యువకులు అందులో పని చేశారు. పైనుంచి వచ్చిన ఆదేశాలను యాక్టివిస్టులు యథావిధిగా పాటించేవారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమత్రి అనిత, ఆయన పిల్లలపై వల్గర్ పోస్టులు పెట్టడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్‌మీడియా వైపు దృష్టి పెట్టింది.  ఈ క్రమంలో పోలీసులు కాలకేయుల గురించి ఆరా తీయడం వారిని విచారించడం మొదలు పెట్టారు. అదుపులో ఉన్నవారంతా వైసీపీకి జిల్లా స్థాయిలో పని చేసిన యాక్టివిస్టులు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగానే అసలు విషయాలు బయటకు వస్తున్నాయి.


పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్, అర్జున్‌రెడ్డితోపాటు మరో వ్యక్తి నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని చెప్పేవారట. వారు ఏది చెబితే తాము అది చేసేవారమని చెప్పారట. ఆ తర్వాత వారి ఫోన్లు చెక్ చేసిన పోలీసులకు అసలు విషయాలు బయటకు వచ్చాయి.

ALSO READ: అమిత్ షాను టాగ్ చేస్తూ ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్.. ఏపీలో మ‌రో దుమారం రేగ‌బోతుందా?

రేపోమాపో ఏఐ టెక్నాలజీని వినియోగించి ఫేక్ వీడియోలు తయారు చేయాలనే ఆలోచనకు వారంతా వచ్చినట్టు సమాచారం. వర్రా రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది నోటి వెంట సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి పేర్లు వచ్చాయి. దీంతో పోలీసులు అటువైపు దృష్టి పెట్టారట. ఆ ముగ్గుర్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు టీమ్‌లు పని చేస్తున్నాయట.

పేరు పొందిన నాలుగు ఛానెళ్లతోపాటు ఐదారు యూట్యూబ్ ఛానెళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఏ రోజు ఏమి జరుగుతుందో వీరి నుంచి సమాచారం వారికి వెళ్లేదని తెలుస్తోంది. కీలకమైన వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆయా ఛానెళ్లపై దృష్టి సారించాలని ఆలోచన చేస్తారట పోలీసులు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×