Bandla Ganesh : సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు బండ్ల గణేష్ (Bandla Ganesh). నిర్మాతగా కూడా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. అందులో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా వున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కు తాను వీరాభిమానిని అని ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య పొలిటికల్ పరంగా కూడా కాస్త యాక్టివ్ గా ఉంటూ.. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా పనిచేస్తున్నారు బండ్ల గణేష్. అయితే నిన్నటి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రముఖులను ఉద్దేశించి, ఒక పోస్ట్ షేర్ చేయడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బండ్ల గణేష్ తాజాగా ప్రముఖులను ఉద్దేశిస్తూ.. ఇండస్ట్రీని షేక్ చేసేలా ఒక ట్వీట్ చేశారు. నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు చాలామంది ప్రముఖులు విషెష్ తెలియజేశారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎంకు విషెస్ చేయడం జరిగింది. అయితే కొంతమంది సినిమా వాళ్లు మాత్రం రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయలేదని బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఒక ట్వీట్ కూడా షేర్ చేశారు.
బండ్ల గణేష్ ఎక్స్ నుంచి ఇలా రాసుకొస్తూ..”గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సినీ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా సమయం లేని వారందరికీ కూడా ఒక పెద్ద నమస్కారం. కేవలం సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావాలి” అంటూ బండ్ల గణేష్ పోస్ట్ షేర్ చేశారు. ఈ విషయం ఒక్కసారిగా అటు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది.
2018 తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయాలని బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ తర్వాత ఏడాది ఏప్రిల్ 5న తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు తెలియజేసినప్పటికీ కూడా తాను కాంగ్రెస్ పార్టీ మనిషిగానే వ్యవహరిస్తున్నారు బండ్ల గణేష్. ఈ మధ్యకాలంలో అటు సినిమాలలో కూడా బండ్ల గణేష్ పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు కేవలం రాజకీయాలపైనే అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటున్నారు.
దీనికి తోడు త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ.. బండ్ల గణేష్ పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తాను దేవుడుగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ ను తన నుంచి దూరం చేస్తున్నారనే వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ ఉంటారు బండ్ల గణేష్. గురూజీ అంటూనే త్రివిక్రమ్ పేరు తీయకుండా బండ్ల గణేష్ చేసే పోస్టులు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మళ్ళీ సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేయలేదు అంటూ ఎక్స్ ద్వారా ట్వీట్ షేర్ చేశారు.
గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”.🙏 @revanth_anumula anna @TelanganaCMO
— BANDLA GANESH. (@ganeshbandla) November 9, 2024