Notices to Tulasi Babu: మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో భాగంగా మరో వ్యక్తికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు రావాలని అందులో ప్రస్తావించారు.
మాజీ ఎంపీ, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మాజీ సీఎం జగన్‌తోపాటు మాజీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, సస్పెండ్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, విజయపాల్, డాక్టర్ ప్రభావతి, తులసిబాబులపై ఫిర్యాదు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. కంప్లయింట్ చేసిన నెల రోజులకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అందులో పైనున్నవారిని చేర్చారు. ఈ క్రమంలో సీఐడీ మాజీ ఎస్పీ విజయ పాల్‌ను విచారించారు పోలీసులు.
విజయపాల్ సన్నిహితుడు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబుకు లేటెస్ట్‌గా నోటీసులు ఇచ్చారు అధికారులు. విచారణకు రావాలని అందులో ప్రస్తావించారు. విజయ పాల్‌కు తులసిబాబు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ALSO READ: పవన్ క్యాంపు ఆఫీసు ఇష్యూ.. చూస్తూ ఊరుకోమన్న వైసీపీ
తులసిబాబు తన గుండెలపై కూర్చుని కొట్టాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణంరాజు. ఇప్పుడు తులసిబాబు వంతైంది. తర్వాత నెక్ట్స్ విచారణకు వెళ్లేదెవరు? అనేది ఆసక్తికరంగా మారింది.
అతడు తర్వాత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ లేదా సీతారామంజనేయులను విచారించనున్నారు. ఆ తర్వాత మాజీ సీఎం జగన్‌ను కూడా విచారించనున్నారు. వీరిచ్చిన నివేదిక ఆధారంగా అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వంతు కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.