YCP on Janasena: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్ వైసీపీలో కాక రేపుతున్నాయా? కడపలో క్యాంపు ఆఫీసు పెడితే.. వైసీపీ పనైపోయినట్టేనా? దీన్ని రాయలసీమ అంశంగా మార్చే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? ఇంతకీ పవన్ క్యాంప్ ఆఫీసు పెడుతున్నారా? లేదా? ఇదే చర్చ పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
కూటమి అధికారంలోకి వచ్చాక మూడుసార్లు కడప వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తొలుత పల్లె పండుగ, ఆ తర్వాత స్టూడెంట్స్-పేరెంట్స్ మీటింగ్, వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓను పరామర్శించడానికి వెళ్లారు. అధికారులపై దాడులు చేయడాన్ని తప్పుబడ్డారు డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో క్యాంపు ఆఫీసు ఓపెన్ చేస్తానని చెప్పుకొచ్చారు. పవన్ మాటలు వైసీపీకి ఎక్కడో తగిలింది.
ఈ క్రమంలో ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లైమ్ లైట్‌లోకి వచ్చేశారు. తాము ఉద్యోగులను రాచి రంపాన పెట్టినట్టు మాట్లాడడం తగదన్నారు. క్యాంపు ఆఫీసు పెట్టి కంట్రోల్ చేశారా? అంటూ మండిపడ్డారు. తామేమైనా స్కూల్ పిల్లలమా? అంటూ ప్రశ్నించారు.
ఉపాది అవకాశాలు కల్పించడానికి క్యాంప్ ఆఫీసు పెడితే ప్రజలు హర్షిస్తారని, తోలు తీయించుకోవడానికి తామేమైనా పశువులమా? అంటూ మండిపడ్డారు. తమను అవమానపరచడానికి వస్తారా అంటూ మండిపడ్డారు. మాతో యుద్ధం చేయాలంటూ నీకు ప్రభుత్వం ఉండాలన్నారు. మాకు అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు పవన్ మాటలను రాయలసీమ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేశారాయన.
ALSO READ: బాబు చెప్పాడంటే.. చేస్తాడు అని.. దట్ ఈజ్ చంద్రబాబు
రెడ్లను ప్రత్యేకంగా చూడక మొన్నటి ఎన్నికల్లో వారంతా జగన్‌కు దూరమయ్యారని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే. వైసీపీకి 11 సీట్లు వచ్చినా ఇంకా అహంకారం తగ్గలేదని డిప్యూటీ సీఎం అనడాన్ని గుర్తు చేస్తూనే.. ఒక్క సీటు వచ్చిన మీరు అధికారంలోకి రాలేదా? మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా అంటూ రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు.
11 సీట్లు వచ్చిన వైసీపీ.. మళ్లీ అధికారంలోకి రారని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు రాచమల్లు. ఏనాడైతే వైసీపీ నేతలను చెప్పుతో కొడతానని బహిరంగంగా చూపించావో.. ఆనాడే మా అధినేత మీ నోటికి తాళం వేస్తే బాగుండేదన్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడేవారు కాదన్నారు. జగన్ మంచోడు మంచోడు అంటూ పదేపదే గుర్తు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.
సోమవారం మీడియా చిట్ చాట్‌లో పార్టీ గురించి మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇక పార్టీ విస్తరణపై దృష్టి పెడతానన్నారు. రాబోయే మూడు నెలలు కేడర్‌తో సమావేశాలు.. సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కడపలో జనసేన ఆఫీసు రావడం ఖాయమని అంటున్నారు అక్కడి కార్యకర్తలు. మొత్తానికి క్యాంపు వ్యవహారం ఇంకెన్ని మలుపు తిరుగుతుందో చూడాలి.