BigTV English

AP News :ఫైన్ వేస్తే పవర్ కట్.. పోలీస్ వర్సెస్ లైన్‌మెన్..

AP News :ఫైన్ వేస్తే పవర్ కట్.. పోలీస్ వర్సెస్ లైన్‌మెన్..
AP News

AP News : ఇది ఖతర్నాక్ న్యూస్. అనగనగా ఓ లైన్‌మెన్. బండి మీద వెళ్తున్నాడు. సడెన్‌గా పోలీసులు అతని బండిని ఆపేశారు. లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ చూపించమన్నారు. ఇతనేమో తాను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని బిల్డప్ ఇచ్చాడు. విద్యుత్ శాఖలో ఉద్యోగినని వదిలేయమని అడిగాడు. పోలీసులతో ఎంతగా వాగ్వాదం చేసినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. అసలే పోలీసోళ్లు. వేరే డిపార్ట్‌మెంట్ ఉద్యోగులను లెక్క చేస్తారా? అందుకే, ఇలాంటి పప్పులేవీ ఉడకవంటూ.. సరైన పత్రాలు లేవంటూ ఫైన్ వేసేశారు.


ఆ లైన్‌మెన్‌కు ఒళ్లు మండింది. తన బండికే ఫైన్ వేస్తారా? ఉండండి మీ సంగతి చెబుతా? అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎలాగైనా ఆ పోలీసులకు షాక్ ఇవ్వాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. తన పరిధిలో పోలీస్ హెల్ప్‌డెస్క్ స్టేషన్ ఉంది. దీంతో, నేరుగా కరెంట్ పోల్ ఎక్కి.. ఆ హెల్ప్ డెస్క్‌కు పవర్ కట్ చేసి పడేశాడు ఆ లైన్‌మెన్.

కరెంట్ లేక, ఎంతకీ రాక.. పోలీస్ హెల్ప్ డెస్క్ సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. అసలేమైందని కనుక్కుంటే.. అసలు విషయం ఆ తర్వాత తెలిసింది. ఆ విద్యుత్ శాఖ ఉద్యోగిపై మండిపడుతున్నారు పోలీసులు. పార్వతీపురంలో జరిగిందీ ఘటన.


Related News

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Big Stories

×