BigTV English

Congress SC ST Declaration: విద్యార్థులకు రూ.లక్ష.. అభయహస్తం రూ.12లక్షలు.. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్..

Congress SC ST Declaration: విద్యార్థులకు రూ.లక్ష.. అభయహస్తం రూ.12లక్షలు.. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్..
Congress SC ST Declaration

Telangana congress chevella meeting(Latest political news telangana):

చేవెళ్ల ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున 12 పాయింట్స్‌తో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. డిక్లరేషన్లో ఆసక్తికర అంశాలు ఉన్నాయి.


ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే రూ.10వేలు ఆర్థిక సాయం.
ఇంటర్ పాసైతే రూ.15వేలు, డిగ్రీ ఉత్తీర్ణత అయితే రూ.25వేలు, పీజీ పాస్ అయితే రూ.లక్ష ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని.. విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందిన వారికి ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చింది.

ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేస్తాం.


అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం.

అన్ని కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షల ఆర్థిక సాయం.

ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు.. ప్రతీ కార్పొరేషన్ ద్వారా ఏటా రూ.750 కోట్ల నిధులు.

ఎస్టీలకు మూడు కార్పొరేషన్లు.. ప్రతీ కార్పొరేషన్‌కు ఏటా రూ.500 కోట్ల నిధులు ఇస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీలకు ఇంటి స్థలాలు

ప్రతీ మండలంలో ఒక గురుకుల పాఠశాల.

గ్రాడ్యుయేషన్‌, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి ఏర్పాటు.

పోడు భూములకు పట్టాలు.

కొత్తగా ఐదు ఐటీడీఏలు ఏర్పాటు.

కేసీఆర్ సర్కార్ తీసుకున్న అసైన్డ్ భూములను వెనక్కి ఇస్తాం.

కొత్తగా ఐదు ఐటీడీఏల ఏర్పాటు

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×