BigTV English

AP: 16సార్లు కత్తితో పొడిచి.. లవర్‌ను దారుణంగా చంపిన ఉన్మాది..

AP: 16సార్లు కత్తితో పొడిచి.. లవర్‌ను దారుణంగా చంపిన ఉన్మాది..

AP: ఈ అబ్బాయిలకు ఏమైంది? ఎందుకిలా ఉన్మాదులుగా మారుతున్నారు? ప్రేమించలేదని ఒకడు.. పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఇంకోడు.. కోరిక తీర్చలేదని మరొకడు.. మనుషులా? రాక్షసులా? వరుస ఘటనలతో సమాజంలో ప్రేమికుల ముసుగులో దాగున్న సైతాన్‌లు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తెలుగువాళ్లలో ఇలాంటి పైశాచిక లక్షణాలు పెరుగుతుండటం ఆందోళనకరం.


ఈసారి బెంగళూరులో ఓ తెలుగు ప్రేమికుడు రెచ్చిపోయాడు. తనను ప్రేమించి, తనతో ఇన్నాళ్లూ కలిసుండి.. ఇప్పుడు వేరే వాడితో పెళ్లికి రెడీ అవుతోందనే కోపంతో.. ప్రేయసిని దారుణంగా పొడిచి చంపాడు. ఆఫీసు బయటే.. అందరూ చూస్తుండగానే.. కత్తితో కసాకసా 16సార్లు పొడిచేశాడు. మృగంలా ప్రవర్తించాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే…

కాకినాడకు చెందిన లీలా పవిత్ర(28). బెంగళూరులో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్‌తో ప్రేమలో పడింది. ఐదేళ్లుగా వాళ్లు డీప్‌గా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో.. తమ ప్రేమ గురించి పేరెంట్స్‌కు చెప్పేసింది లీలా. అందరిలానే ఆ తల్లిదండ్రులు వారి ప్రేమ, పెళ్లికి నో చెప్పారు. కుదరదంటే కుదరదని తేల్చి చెప్పేశారు. వెంటనే కూతురుకు వేరే సంబంధం కుదిర్చారు. పెద్దల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు లీలా పవిత్రకు.


ఇక చేసేదేముంది.. అందరిలానే ఆమె కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్దమైపోయింది. ఎప్పటిలానే ఆఫీసుకు వెళ్తోంది. అయితే, అక్కడ తన లవర్ దివాకర్‌తో మెళ్లగా దూరం జరగసాగింది. మునుపటిలో కలవడం లేదు.. కలిసి ఉండటం లేదు.. రెండు నెలలుగా దివాకర్‌ను మాగ్జిమమ్ అవాయిడ్ చేసింది లీలా.

ఆ దూరాన్ని దివాకర్ తట్టుకోలేకపోయాడు. ఆరా తీస్తే ఆమెకు వేరే వ్యక్తితో మ్యారేజ్ సెటిల్ అయిందని తెలిసింది. ఆ విషయం భరించలేకపోయాడు. ఐదేళ్లుగా తనతో ఎంజాయ్ చేసి.. ఇప్పుడు వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందా? అని కోపంతో రగిలిపోయాడు. ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.

ఆఫీస్ అయిపోగానే.. బయటకు వచ్చిన లీలాపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు దివాకర్. మిగతా ఎంప్లాయిస్ అంతా చూస్తుండగానే.. ఆమెను విచక్షణారహితంగా పొడిచేశాడు. ఉన్మాదిలా ప్రవర్తించాడు. రక్తం ఓడుతున్నా.. లీలా అచేతనంగా పడిపోయినా.. ఆగలేదు ఆ సైకో. కత్తితో పదే పదే పొడిచాడు. అలా మొత్తం 16 పోట్లు పొడిచాడు.

ఎవరో పోలీసులకు ఫోన్ చేయగా.. వారు నిమిషాల వ్యవధిలోనే స్పాట్‌కు చేరుకున్నారు. ఉన్మాది దివాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాల పాలైన లీలా పవిత్రను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు పోలీసులు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×