BigTV English

Jeevitha: 30 త‌ర్వాత‌ జీవితా రాజ‌శేఖ‌ర్ రీ ఎంట్రీ

Jeevitha: 30 త‌ర్వాత‌ జీవితా రాజ‌శేఖ‌ర్ రీ ఎంట్రీ
Jeevitha

సీనియ‌ర్ న‌టి, ద‌ర్శ‌కురాలు జీవితా రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి న‌టిగా మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. హీరోయిన్ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన జీవిత‌, హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌ను వివాహం చేసుకున్న ఆమె త‌ర్వాత న‌టిగా కొన‌సాగ‌లేదు. ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా సినీ రంగంతో అనుబంధాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. అయితే 30 ఏళ్ల త‌ర్వాత న‌టిగా మ‌రోసారి జీవిత సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. అది కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో .. ఆ సినిమా ఏదో కాదు.. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ త‌న‌య ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న లాల్ స‌లామ్‌.


చాలా రోజుల త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్‌.. మెగా ఫోన్ ప‌ట్టారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తున్న లాల్ స‌లామ్‌లో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఇందులో ఆయ‌న చెల్లెలు పాత్ర‌లో జీవిత న‌టించ‌నుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణం కావ‌టం.. ర‌జినీకాంత్ చెల్లెలు పాత్ర కావ‌టంతో లాల్ స‌లామ్‌లో న‌టించ‌టానికి జీవిత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మార్చి 7 నుంచి ఈ సినిమా ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌టానికి ర‌జినీకాంత్ వారం రోజుల‌ను కేటాయించారు. అందుకు ఆయ‌న‌కు ఏకంగా రూ.25 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌టానికి నిర్మాత‌లు రెడీ అయ్యారని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రో వైపు ర‌జినీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×